Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రధాని మోదీ ప్రశంసలు.. వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ వైరల్(వీడియో)

ఆసియా గేమ్స్ 2026లో స్వర్ణ పతకం సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ప్రత్యేకంగా వైభవ్ పేరు ప్రస్తావించకపోయినా.. 15 ఏళ్లకే పతకాలు సాధించారని కొనియాడారు. ప్రధాని మాటలకు వైభవ్ గర్వంతో కూడిన చిరు నవ్వుతో బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Asian Games 2026: ఇవి పతకాలు కాదు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Asian Games 2026: ఇవి పతకాలు కాదు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

ఆసియా గేమ్స్ 2026లో పతకాలు సాధించిన అథ్లెట్లను గురువారం ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు చారిత్రాత్మక విజయాలు సాధించారని కొనియాడారు. ఈ క్రమంలో యువ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

Vaibhav Sooryavanshi Reaction Goes Viral After PM Modi s Special Remark at Asian Games Felicitation

'ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత జట్టులో 15 నుంచి 17 ఏళ్ల వయసున్న అథ్లెట్లు ఎందరో ఉన్నారు. ఇంత చిన్న వయసులోనే వారు అసాధారణమైన ప్రదర్శనతో పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠ‌ను పెంచారు. యావత్ భారతవాణి హృదయాలను గెలుచుకున్నారు. విజయానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు. క్రీడలను చిన్న వయసులో ప్రారంభిస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుంది.'అని మోదీ అన్నారు.

ప్రధాని మాటల్లో వైభవ్ పేరు లేకపోయినా.. కెమెరాలన్నీ అతన్నే చూపించాయి. ప్రధాని ప్రశంసలకు వైభవ్ ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు కనిపించింది. చిన్న వయసులోనే క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు.

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

Also Read

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

'ఖేలో ఇండియా, ఎమర్జింగ్ ఖేలో ఇండియా ద్వారా వచ్చే కొన్నేళ్లలో చాలా మంది కొత్త అథ్లెట్లకు అవకాశాలు లభిస్తాయి.'అని మోదీ పేర్కొన్నారు. భారత్ సాధించిన 85 పతకాల్లో 38 మెడల్స్ మహిళా అథ్లెట్లే గెలుచుకున్నారని ప్రశంసించారు. అందులో 11 స్వర్ణాలు ఉన్నాయని గుర్తుచేశారు. 'ఈ పతకాలు కేవలం అంకెలు మాత్రమే కాదు. భారత క్రీడా శక్తికి ప్రతీకలు'అని కొనియాడారు.

Story first published: Friday, October 16, 2026, 11:36 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+