Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: వైభవ్‌కు మళ్లీ నిరాశే.. నోరు మెదపని శ్రేయస్ అయ్యర్ !

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మళ్లీ నిరాశే ఎదురైంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్ .. ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుందని అంతా అనుకున్నారు.

రెండో టీ20 అనంతరం టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే చెప్పాడు. కానీ జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడంపై శ్రేయస్ అయ్యర్ నోరు కూడా మెదపలేదు. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో యశ్ ఠాకూర్ ఆడుతున్నాడని మాత్రమే చెప్పాడు. మరోసారి వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

IND vs WI: 8 మంది ఆటగాళ్లపై వేటు.. భారత వన్డే జట్టులో భారీ మార్పులు!

IND vs WI: 8 మంది ఆటగాళ్లపై వేటు.. భారత వన్డే జట్టులో భారీ మార్పులు!

అందుకే బౌలింగ్..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి అఫ్గానిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జడ్రాన్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. గత రెండు మ్యాచ్‌ల్లో కూడా బౌలింగే చేయాలనుకున్నాం. కానీ టాస్ గెలవలేదు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో మా ప్రణాళికలను అమలు చేస్తామని భావిస్తున్నా. భారత్‌పై ఒత్తిడి తెచ్చి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంటాం.

Vaibhav Sooryavanshi Ignored Again as India Face Afghanistan in 3rd T20I Shreyas Iyer Stays Silent

మేం సిరీస్ ఓడిపోయాం నిజమే. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో మేం ఎక్కడ తప్పు చేశాం. ఏ విషయాల్లో మెరుగవ్వాలనే విషయాలను చర్చించుకున్నాం. చివరి మ్యాచ్‌ను గెలిచి మంచి ముగింపు ఇవ్వాలని భావిస్తున్ననాం. భారత్ అత్యుత్తమ జట్లలో ఒకటి. మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. మా జట్టులో రెండు మార్పులు చేశాం. గుల్బాదిన్ నైబ్, నూర్ అహ్మద్ స్థానాల్లో అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నూర్ ఉల్ రెహ్మాన్ జట్టులోకి వచ్చారు.'అని ఇబ్రహీం జడ్రాన్ చెప్పుకొచ్చాడు.

అలసత్వం వద్దని చెప్పా..

మరోవైపు టాస్ గెలిచినా తాము బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'అఫ్గాన్ కెప్టెన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో నాకు ముందే తెలుసు. మా శక్తి మేర బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. సిరీస్ గెలిచామని ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని మా ఆటగాళ్లకు చెప్పా. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలని, వికెట్‌కు తగ్గట్లుగా ఆడటం నేర్చుకోవాలని సూచించా.

ఈ మ్యాచ్ మాకు మంచి సవాల్. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు ఉంది. అర్ష్‌దీప్ స్థానంలో యశ్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు.'అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్‌ను విడదీసే ఆలోచన టీమిండియా మేనేజ్‌మెంట్‌కు లేనట్లు తెలుస్తోంది. వైభవ్ సూర్యవంశీని కేవలం బ్యాకప్ ఓపెనర్‌గా చూస్తున్నట్లు అర్థమవుతోంది.

పాపం పృథ్వీ షా.. కెరీర్‌తో పాటు లవ‌ర్ కూడా పాయే!

Also Read

పాపం పృథ్వీ షా.. కెరీర్‌తో పాటు లవ‌ర్ కూడా పాయే!

తుది జట్లు..

అఫ్గానిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రెహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, దార్విష్ రసూలీ, నూర్ ఉల్ రెహ్మాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్‌హక్ ఫారూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

భారత్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Thursday, September 17, 2026, 19:51 [IST]
Other articles published on Sep 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+