పాపం పృథ్వీ షా.. కెరీర్‌తో పాటు లవర్ కూడా పాయే!
జీవితం చాలా విచిత్రమైనది. ఈ మాట టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా జీవితాన్ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అండర్ 19 ప్రపంచకప్ విజయంతో తారా జువ్వలా భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరమయ్యాడు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్‌ను నాశనం చేశాయి.
దాంతో భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదుగుతాడని భావించిన పృథ్వీ షా.. ఐపీఎల్ టీమ్‌లో కూడా చోటు దక్కించుకోలేని దయనీయస్థితికి చేరాడు. దేశవాళీ స్టార్‌గానే కెరీర్‌ను ముగించే దిశగా సాగుతున్నాడు. 24 ఏళ్లకే పొట్ట, బట్టతో అంకుల్‌లా మారిపోయిన పృథ్వీ షా..తన తప్పిదాలను తెలుసుకొని కెరీర్ రీస్టార్ట్ చేసేలా కనిపించాడు.
పెళ్లి పెటాకులు..
ఇదే క్రమంలో సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్న తన స్నేహితురాలు, నటి ఆకృతి అగర్వాల్‌తో ఈ ఏడాది మార్చిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని పృథ్వీ షా చాలా సంతోషంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాకుండా ఆకృతిపై చాలా పోస్టుల్లో తన ప్రేమను చాటుకున్నాడు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ జోడీ పెళ్లి పీటలెక్కలేదు. తమ లక్ష్యాలు, ఆలోచనలు భిన్నమైనవి, మా దారులు వేరు అంటూ నటి ఆకృతి అగర్వాల్ ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది.

కెరీర్ పోయిందనే బాధలో ఉన్న పృథ్వీ షాకు ప్రియురాలితో ఉపశమనం లభించగా.. ఇప్పుడు ఆమె కూడా దూరమవడంతో అతని పరిస్థితి ఏంటని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పృథ్వీ షా తలరాతనే సరిగ్గా లేనట్లుందని అతని అభిమానులు జాలి చూపుతున్నారు.
నాలుగేళ్లకే తల్లి మరణం..
పృథ్వీ షా ఎంత సక్సెస్ చూశాడో అంతకు మించిన కష్టాలను అనుభవించాడు. నాలుగేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో తండ్రి పర్యవేక్షణలో పెరిగాడు. అసాధారణ ప్రతిభతో 18 ఏళ్లకే అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. టీమిండియా ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. మరో సచిన్, కోహ్లీ అవుతాడని విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అంతలోనే గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లి పోయిన పృథ్వీ షా.. చెడు స్నేహాలతో కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.
తనకు తాను మోటివేట్ చేసుకోని పునరాగమనం కోసం ప్రయత్నించిన ప్రతీసారి ఏదో ఒక ఆటంకం అతన్ని వెంటాడింది. మళ్లీ గాయాలవ్వడం లేక.. జట్టులో సరైన అవకాశాలు దక్కకపోవడమో జరిగేది. దాంతో పృథ్వీ షా మరింత కృంగిపోయాడు. ఇప్పుడు ప్రియురాలు కూడా వదిలేయడంతో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ కష్ట కాలంలో పృథ్వీ షాకు తాను నమ్మే సాయి బాబానే అండగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


