Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: 8 మంది ఆటగాళ్లపై వేటు.. భారత వన్డే జట్టులో భారీ మార్పులు!

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టీమిండియా గత వన్డే సిరీస్‌తో పోల్చితే ఈ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏకంగా 8 మంది ఆటగాళ్లను కొత్తగా జట్టులో చేర్చారు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనలో భారత్ చివరిసారిగా వన్డే సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే.

IND vs WI: భారత వన్డే జట్టులో కొత్త ముఖాలు.. హార్దిక్‌కు ఎసరు పెట్టిన తెలుగోడు!

IND vs WI: భారత వన్డే జట్టులో కొత్త ముఖాలు.. హార్దిక్‌కు ఎసరు పెట్టిన తెలుగోడు!

జపాన్ వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌ 2026‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు బరిలోకి దిగుతుండటంతో ఈ మార్పులు అనివార్యమయ్యాయి. ఆసియా గేమ్స్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఒకే సమయంలో జరుగుతుండటంతో జట్టులో భారీ మార్పులు చేయాల్సి వచ్చింది.

India ODI Squad for West Indies Series 8 Players Out as Jadeja Siraj and Jaiswal Return

ఏక కాలంలో రెండు సిరీస్‌లు..

ఆసియా గేమ్స్‌లో అయ్యర్ సారథ్యంలో ఒక భారత జట్టు ఆడితే.. మరోవైపు వెస్టిండీస్‌తో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని మరో భారత జట్టు తలపడనుంది. వన్డే వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో ఆ బాధ్యతలను తిరిగి కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం కల్పించారు.

భారత వన్డే టీమ్‌లో చేరిన 8 మంది ఆటగాళ్లు..

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగం కానీ ప్రముఖ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు. వీరితో పాటు పంజాబ్ బ్యాటర్లు నమన్ ధీర్, జమ్మూ కశ్మీర్ పేసర్, రంజీ సెన్సేషన్ ఆకిబ్ నబీ‌లకు తొలి సారి వన్డే పిలుపు దక్కింది.

వన్డే టీమ్‌కు దూరమైన 8 మంది ఆటగాళ్లు..

ఆసియా గేమ్స్ 2026 ఆడనున్న జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్‌లు వన్డే జట్టులో చోటు కోల్పోయారు. ఈ ఆరుగురితో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో జట్టులో ఉన్న హర్ష్‌ దూబే, ప్రిన్స్ యాదవ్‌‌లు కూడా వన్డే జట్టులో అవకాశాన్ని అందుకోలేకపోయారు.

IND vs AFG 3rd T20I: భారత తుది జట్టులో 3 మార్పులు.. వైభవ్ సూర్యవంశీకి చోటు!

Also Read

IND vs AFG 3rd T20I: భారత తుది జట్టులో 3 మార్పులు.. వైభవ్ సూర్యవంశీకి చోటు!

భారత వన్డే జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్న ఆటగాళ్లు(7)

మరో ఏడుగురు మాత్రం వన్డే టీమ్‌లో తమ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఈ మార్పులు చేసింది.

Story first published: Thursday, September 17, 2026, 10:44 [IST]
Other articles published on Sep 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+