Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్ షమీకి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ స్పెషల్ గిఫ్ట్!

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరుదైన బహుమతి అందజేశాడు. జట్టులోని ఆటగాళ్లందరి సంతకాలతో కూడిన జెర్సీని స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చి సత్కరించాడు.

సౌత్ జోన్‌తో చెన్నై వేదికగా గురువారం ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ మ్యాచ్ డ్రా గా ముగిసినా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంతో ఈస్ట్ జోన్‌కు టైటిల్ వరించింది. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్.. దులీప్ ట్రోఫీ గెలిచింది.

తిలక్ వర్మ.. గెలికి తన్నించుకోవడం అంటే ఇదే బ్రో!

తిలక్ వర్మ.. గెలికి తన్నించుకోవడం అంటే ఇదే బ్రో!

డ్రాగా ముగిసిన ఫైనల్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్వితీయమైన డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసింది. అనంతరం సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌ను ఈస్ట్ జోన్ 388/7 డిక్లేర్ చేసింది.

Vaibhav Sooryavanshi Gives Special Gift to Mohammed Shami Ahead of His 100th First-Class Match

ఈ మ్యాచ్ అనంతరం విజయోత్సవ వేడుకల సందర్భంగా వైభవ్ సూర్యవంశీ సంతకం చేసిన జెర్సీని మహమ్మద్ షమీకి బహుమతిగా అందజేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన షమీ.. కోచ్‌లు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు.

అస్సలు ఊహించలేదు..

'నా జ్ఞాపకాలను నేను ఇప్పటికే పంచుకున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో మొదటి రోజు నుంచి నేటి వరకు నాకు మద్దతుగా నిలిచిన నా సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను.

ఇది నాకు చాలా గర్వకారణమైన క్షణం. నేను క్రికెట్‌లో ఇంత దూరం వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇప్పుడు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాను. భారత జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాను.

వైభవ్ సూర్యవంశీ వయసు నా కెరీర్ అంత లేదు: మహమ్మద్ షమీ

Also Read

వైభవ్ సూర్యవంశీ వయసు నా కెరీర్ అంత లేదు: మహమ్మద్ షమీ

సర్వశక్తులూ ఒడ్డండి..

యువ ఆటగాళ్లు ఎంత దూరం ప్రయాణిస్తారో ఎవరూ ఊహించలేరు. కానీ ప్రతీ ఒక్కరూ కష్టపడతారు. కాబట్టి నేను చెప్పేదల్లా ఒక్కటే. కష్టపడుతూనే ఉండండి. మీ కఠోర శ్రమ మిమ్మల్ని ఎప్పుడు ఏ శిఖరాలకు తీసుకువెళ్తుందో మీరు ఊహించలేరు.

క్రికెట్ ఆటకు అవసరమైన అంకితభావం. విధేయతను ఎప్పుడూ విస్మరించవద్దు. ఏ జట్టు తరఫున ఆడినా సర్వశక్తులూ ఒడ్డి ఆడండి.'అని షమీ కుర్రాళ్లకు సూచించాడు. 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో షమీ 26.28 సగటుతో 384 వికెట్లు పడగొట్టాడు. 15 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

Story first published: Thursday, September 10, 2026, 22:11 [IST]
Other articles published on Sep 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+