IND vs NZ: నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ.. లైఫ్ లభించినా నో యూజ్!(వీడియో)
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా నిరాశపర్చాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ అంచనాలను అందుకోలేకపోయాడు. 8 బంతుల్లో 4 పరుగులే చేసి నాథన్ స్మిత్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
స్మిత్ వేసిన హార్డ్ లెంగ్త్ బాల్‌ను వైభవ్ డ్రైవ్ షాట్ ఆడాడు. కానీ కవర్ ఫీల్డర్ డారిల్ మిచెల్ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. దాంతో వైభవ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. తన కెరీర్‌లోనే తొలిసారి ఓపెనర్‌గా కాకుండా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా తడబడ్డాడు.
ఈ మ్యాచ్‌కు గాయంతో ఇషాన్ కిషన్ దూరమవడంతో వైభవ్ సూర్యవంశీకి ఈ అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. అయితే వైభవ్ కోసం ఫామ్‌లో ఉన్న ఓపెనింగ్ జోడీని విడదీయని టీమ్‌మేనేజ్‌మెంట్.. వైభవ్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించింది. కానీ అతను తనదైన శైలిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. మైఖేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో లైఫ్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

అతను ఆడిన లాఫ్టెడ్ డ్రైవ్ షాట్‌కు బంతి గాల్లోకి లేవగా.. బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేసిన జాకబ్స్ అందుకోలేకపోయాడు. ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గట్టిగా అరుస్తూ.. బెవాన్ జాకబ్స్‌ను బండబూతులు తిట్టాడు. కానీ ఆ మరుసటి ఓవర్‌లోనే వైభవ్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకోబ్స్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/50), ప్రిన్స్ యాదవ్(1/30), నితీష్ కుమార్ రెడ్డి(1/31)తలో వికెట్ తీసారు. స్పిన్నర్లు నమన్ ధీర్, అక్షర్ పటేల్ వికెట్లు తీయకపోయినా.. కట్టడిగా బౌలింగ్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


