Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: గేమ్ ప్లాన్ మార్చాం.. తుది జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్ : శ్రేయస్ అయ్యర్

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇషాన్ కిషన్ గాయపడటంతో తమ గేమ్ ప్లాన్‌లో స్వల్ప మార్పులు చేశామని వెల్లడించాడు.

తుది జట్టులోకి వైభవ్ సూర్యవంశీ రాగా.. వ్యూహాత్మకంగా మాయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఆడిస్తున్నామని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. డ్యూ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. తొలి టీ20 అనంతరం లభించిన విరామం ఆటగాళ్ల రికవరికీ బాగా ఉపయోగపడింది. అందరూ మంచి ఫిట్‌నెస్‌తో ఉత్సాహంగా ఉన్నారు. మైదానంలో దూకుడుగా ఆడటమే ముఖ్యం. కానీ స్లో ఓవర్‌రేట్‌కు కారణం కాకుండా ఆడాల్సిన బాధ్యత మాపై ఉంది.

IND vs ZIM: ప్రతీకా రావల్ శతకం.. టీమిండియా ఘన విజయం!

IND vs ZIM: ప్రతీకా రావల్ శతకం.. టీమిండియా ఘన విజయం!
IND vs NZ Shreyas Iyer Reveals Why India Included Vaibhav Sooryavanshi and Prince Yadav in 2nd T20I Vs New Zealand

ముఖ్యంగా ఎక్స్‌ట్రా ఫీల్డర్ సర్కిల్ లోపలికి రాకుండా చూసుకోవాలి. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. ఇషాన్ కిషన్ గాయపడటంతో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. వ్యూహాత్మక మార్పులో భాగంగా మయాంక్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ ఆడుతున్నాడు.'అని అయ్యర్ తెలిపాడు.

గత మ్యాచ్‌లో ఓడినా గట్టి పోటీ ఇచ్చామని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. తమ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నాడు. అయినా తమది గొప్ప జట్టు అని చెప్పుకొచ్చాడు. తొలి టీ20 అనంతరం లభించిన విశ్రాంతితో కాస్త రిలాక్స్ అయ్యామని చెప్పిన సాంట్నర్.. తుది జట్టులో ఒక మాప్పు జరిగిందని చెప్పాడు. మిల్నే స్థానంలో డఫీ జట్టులోకి వచ్చాడన్నాడు. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో బౌలర్లను రొటేట్ చేస్తున్నామని చెప్పాడు.

బౌలర్లు బాధితులు కాదు.. నాపై నాకు అంచనాలు లేవు: భువనేశ్వర్ కుమార్

Also Read

బౌలర్లు బాధితులు కాదు.. నాపై నాకు అంచనాలు లేవు: భువనేశ్వర్ కుమార్

తుది జట్లు:

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జేకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్.

భారత్: సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

Story first published: Saturday, October 24, 2026, 12:25 [IST]
Other articles published on Oct 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+