Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: కేఎల్ రాహుల్‌తో సహా ఐదుగురు బ్యాటర్లు డకౌట్.. 113 పరుగులకే భారత్ ఆలౌట్!

న్యూజిలాండ్ పర్యటనలో భారత్-ఏ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. న్యూజిలాండ్-ఏతో శనివారం ప్రారంభమైన తొలి అనధికారిక టెస్ట్‌లో భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన భారత్‌కు న్యూజిలాండ్-ఏ బౌలర్లు సైమన్ కీన్(5/24), జాక్ గిబ్సన్(3/29) దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ ఇద్దరి దెబ్బకు భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

IND vs NZ: గాయంతో ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్! న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: గాయంతో ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్! న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

ఏకంగా ఐదుగురు బ్యాటర్లకు డకౌటయ్యారు. యశస్వి జైస్వాల్(17), కేఎల్ రాహుల్(0), సాయి సుదర్శన్(0), వాషింగ్టన్ సుందర్(0), కెప్టెన్ ధ్రువ్ జురెల్(1) తీవ్రంగా నిరాశపర్చగా.. దేవదత్ పడిక్కల్(32), యశ్ రాథోడ్(44) పర్వలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సైమన్ కీన్(5/24), జాక్ గిబ్సన్(3/29)లకు తోడుగా ఫ్రెజర్ షీట్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీసారు.

KL Rahul Among Five Batters to Score Ducks as India A Collapse for 113 Against New Zealand A

రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ భారత్‌-ఏ తరఫున ఈ మ్యాచ్‌ బరిలోకి దిగగా ఆకట్టుకోలేకపోయారు. న్యూజిలాండ్ పర్యటనను పేలవంగా ప్రారంభించారు. కేఎల్ రాహుల్ 8 బంతులే ఆడి ఒక్క పరుగు చేయకుండానే కీపర్ క్యాచ్‌‌గా వెనుదిరగ్గా.. సాయి సుదర్శన్ 13 బంతులాడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

IND vs NZ: కేఎల్ రాహుల్ ఔట్.. 21 ఏళ్ల జార్ఖండ్ కుర్రాడికి చోటు!

Also Read

IND vs NZ: కేఎల్ రాహుల్ ఔట్.. 21 ఏళ్ల జార్ఖండ్ కుర్రాడికి చోటు!

77 బంతులాడిన పడిక్కల్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా.. కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. కెప్టెన్ ధ్రువ్ జురెల్ 13 బంతులాడి ఒకే ఒక్క పరుగు చేసి క్యాచ్ ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 6 బంతులే ఆడి ఒక్క పరుగు చేయకుండా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. టెయిలెండర్స్ ఆకాష్ దీప్(0), ముఖేష్ చౌదరీ(0) కూడా డకౌటయ్యారు.

దేవదత్ పడిక్కల్, యశ్ రాథోడ్ కాస్త పోరాడటంతో భారత్-ఏ 113 పరుగులు చేయగలిగింది. లేదంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్-ఏ నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక్క వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది.

Story first published: Saturday, October 24, 2026, 9:23 [IST]
Other articles published on Oct 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+