IND vs WI: అతని బ్యాటింగే గెలిపించింది: శ్రేయస్ అయ్యర్
ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్‌తోనే వెస్టిండీస్‌తో మూడో టీ20లో విజయం సాధించామని టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. చివర్లో అతను చేసిన విలువైన పరుగులు విజయానికి కలిసొచ్చాయని తెలిపాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలవడం ఇదే తొలిసారి. డ్యూ లేకపోవడంతో భారత్ విజయానికి కలిసొచ్చింది.
అభిషేక్ అదరగొట్టాడు..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ప్రిన్స్ యాదవ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'అభిషేక్ శర్మ.. పవర్ ప్లేలో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ తన జోరును కొనసాగిస్తూ..రిమార్కబుల్ బ్యాటింగ్ చేశాడు.

మేం వరుసగా వికెట్లు కోల్పోయినా వెస్టిండీస్ మ్యాచ్‌పై పట్టుబిగించకుండా జాగ్రత్త పడ్డాం. మిడిల్ ఆర్డర్ భాగస్వామ్యాలతో 223 పరుగుల భారీ స్కోరు చేయగలిగాం. చివర్లో ప్రిన్స్ యాదవ్ ఆడిన చిన్న క్యామియో కూడా విజయానికి బాగా ఉపయోగపడింది.
డ్యూ లేకపోవడం కలిసొచ్చింది..
వెస్టిండీస్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వాళ్ల జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ప్లేయర్లు ఉన్నారు. అందుకే ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి. తదుపరి మ్యాచ్‌ల వేదికలు హైదరాబాద్, బెంగళూరు. ఈ రెండు కూడా భారీ స్కోర్లు నమోదయ్యే పిచ్‌లే. అక్కడ కూడా మేం మైండ్ సెట్ మార్చుకోకుండా అదే ప్రాసెస్.. రొటీన్‌ను పాటిస్తూ మరింత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాం.
డ్యూ ప్రభావం లేకపోవడంతో కెప్టెన్‌గా నా పని ఈజీ అయ్యింది. బౌలర్లు రన్-అప్ మొదలు పెట్టే సమయంలోనే వాళ్లకి ఏం చేయాలి? ఎలాంటి ప్లాన్స్ అమలు చేయాలనే క్లారిటీ ఉంటుంది. నేను ఎవరికి బంతి అందిచ్చినా వాళ్లు ఆ ఛాలెంజ్‌ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక కెప్టెన్‌గా నాకు కావాల్సింది కూడా అదే.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
అర్ష్‌దీప్ సింగ్ తీన్మార్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్ శర్మ(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్(18 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 37), తిలక్ వర్మ(16 బంతుల్లో 4 ఫోర్లతో 28) దూకుడుగా ఆడారు. ప్రిన్స్ యాదవ్(6 బంతుల్లో 3 ఫోర్లతో 13 నాటౌట్) ఆఖరి ఓవర్‌లో వరుసగా బౌండరీలు బాది విలువైన పరుగులు చేశాడు.
అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులే చేసి ఓటమిపాలైంది. కమిల్ పూరన్(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), షిమ్రాన్ హెట్‌మైర్(26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), షమర్ స్ప్రింగర్(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 35 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/44) మూడు వికెట్లు తీయగా.. నమన్ ధీర్(2/39) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


