Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంక గడ్డపై వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. శ్రీలంక గడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌-ఏతో మ్యాచ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కానీ క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లను ఊచకోత కోసాడు. 200 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. వైభవ్ ధాటికి భారత్-ఏ ఏడు ఓవర్లలోనే 74 పరుగులు చేసింది.

రాజస్థాన్ రాయల్స్ కాదు.. బుడ్డోడి ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే! (వీడియో)

రాజస్థాన్ రాయల్స్ కాదు.. బుడ్డోడి ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే! (వీడియో)

ఈ మ్యాచ్‌లో భారత్-ఏ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. వైభవ్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ బాదిన వైభవ్.. మరుసట బంతిని కూడా బౌండరీ తరలించాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ నిదానంగా ఆడినా వైభవ్ వరుస బౌండరీలతో చెలరేగాడు. అబ్దుల్లా వేసిన బౌలింగ్‌లో ర్యాంప్ షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Vaibhav Sooryavanshi Blazes 44 Off 22 Balls to Power India A in Tri-Series Clash Against Afghanistan A
Photo Credit: X (twitter)

క్రీజులోకి వచ్చిన ప్రియాన్ష్ ఆర్య సిక్సర్‌తో దూకుడు కనబర్చాడు. కానీ అతన్ని అబ్దుల్లా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. గైక్వాడ్ క్రీజులోకి రాగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు.

భారత జట్టులోకి తీసుకోమని అడుక్కోలేను: భువనేశ్వర్ కుమార్

భారత జట్టులోకి తీసుకోమని అడుక్కోలేను: భువనేశ్వర్ కుమార్

ఈ సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో గత మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ జట్టు 8 పరుగులతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి 4 బంతుల్లో మూడు వికెట్లు తీసి భారత్-ఏ గెలిచింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ నిరాశపర్చాడు. కానీ తాజా మ్యాచ్‌లో తనదైన బ్యాటింగ్‌తో చెలరేగాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ ప్రదర్శనతోనే భారత్-ఏ జట్టుతో పాటు భారత టీ20 టీమ్‌లోనూ వైభవ్ చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపిక చేసిన టీ20 టీమ్‌లో వైభవ్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు.

Story first published: Thursday, June 11, 2026, 11:35 [IST]
Other articles published on Jun 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+