భారత జట్టులోకి తీసుకోమని అడుక్కోలేను: భువనేశ్వర్ కుమార్
భారత సెలెక్టర్ల తీరుపై వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అసహనం వ్యక్తం చేశాడు. భారత జట్టులో ఉండటం గౌరవమని, కానీ ఆ అవకాశం కోసం ఎవరిని అడుక్కోలేనని తెలిపాడు. తన ప్రతిభను గుర్తించి జట్టులోకి ఎంపిక చేస్తేనే ఆడుతానని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 16 మ్యాచ్‌ల్లో 28 వికెట్లతో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ అద్వితీయమైన ప్రదర్శనతో భువనేశ్వర్ కుమార్‌ను టీ20 జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ భారత సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు.

సెలెక్ట్ చేయమని అడుక్కోలేను..
సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చి ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేశారే తప్పా.. భువీ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. యువ ఆటగాళ్లకే సెలెక్టర్లు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భువనేశ్వర్ కుమార్ సెలెక్లర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'నేను ఆడినట్లు నటించాలనుకోను. అది నా నైజం కాదు. ప్రతీ ఒక్కరూ తమ పనిని తాము చక్కగా చేస్తారు. జట్టును ఎంపిక చేయడం పూర్తిగా సెలెక్టర్ల బాధ్యత. నేను అర్హుడిని అని వారు భావిస్తే తప్పకుండా ఎంపిక చేస్తారు. నన్ను ఎంపిక చేయమని ఎవర్ని అడగను. టీమిండియా తరఫున ఆడాలనే కోరిక ఇప్పటికీ నాలో బలంగా ఉంది. నేను మెరుగైన ప్రదర్శన చేస్తున్నా..టీమిండియా తరఫున ఆడడాన్ని ఇప్పటికీ ఒక అదృష్టంగానే భావిస్తాను.
నేను చేయాల్సిన పనులన్నీ ఇప్పటికే చక్కగా చేశాను. ఒకవేళ నేను భారత జట్టుకు ఆడకపోయి ఉంటే ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. భారత జట్టు తరఫున ఆడటం సాధారణ విషయం కాదు. ఆ అవకాశం దక్కించుకున్న అదృష్టవంతుల్లో నేను ఒకడిని.'అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.
అరంగేట్ర ఓవర్‌లోనే వికెట్..
భువనేశ్వర్ కుమార్ తన అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే వికెట్ తీసాడు. పాకిస్థాన్‌పై 2012లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లోనే పాక్ ఓపెనర్ నసీర్ జంషేడ్‌ను ఔట్ చేశాడు.
మూడు ఫార్మాట్లలో కలిసి అతను 294 వికెట్లు తీసాడు. 2022లో చివరి టీ20 మ్యాచ్ ఆడిన భువనేశ్వర్ కుమార్ అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతున్నాడు. ఆర్‌సీబీ తరఫున గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications