యూపీ క్రికెట్‌కు జెన్ జీ సెగ.. మూడు రంజీ టీమ్స్ కోసం డిమాండ్!
దేశాన్ని కుదిపేసిన జెన్-జీ నిరసనల సెగ ఇప్పుడు క్రికెట్‌కు కూడా తాకింది. ఉత్తరప్రదేశ్‌కు ఒకే రంజీ టీమ్ సరిపోదని, మూడు జట్లను ఏర్పాటు చేయాలని జెన్-జీ క్రికెటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉత్తప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ)ను మూడు భాగాలుగా విభజించాలని డిమాండ్ చేస్తూ లక్నో స్టేడియంలో నిరసన వ్యక్తం చేశారు.
సుమారు 250 మంది జెన్ జీ క్రికెటర్లు తమ తల్లిదండ్రులతో కలిసి ఈ నిరసనల్లో పాల్గొనడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. యూపీసీఏ క్రికెటర్ల అసోసియేషన్, పూర్వాంచల్ క్రికెట్ అసోసియేషన్ ఆటగాళ్ల ఆధ్వర్యంలో లక్నోలోని ఏకాన స్టేడియంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

యూపీ చాలా పెద్ద రాష్ట్రం..
యూపీ చాలా పెద్ద రాష్ట్రమని, జానాభా కూడా ఎక్కువేనని, ఒకే రంజీ టీమ్ కారణంగా ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందని నిరసనకారులు ఆరోపించారు. యూపీ క్రికెట్ అసోసియేషన్‌ను మూడు అసోసియేషన్లుగా విభజించి మూడు రంజీ టీమ్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలపై యూపీ క్రికెట్ ప్లేయర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ సింగ్ మాట్లాడుతూ.. మూడు జట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. 'యూపీ వంటి పెద్ద రాష్ట్రానికి ఒకటి కంటే ఎక్కువ రంజీ టీమ్స్ ఉండాల్సిన అవసరం ఉందని సీఎం యోగి ఆదిత్య నాథ్ గతంలో అన్నారు. 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి మూడు క్రికెట్ అసోసియేషన్స్, వాటి ద్వారా మూడు రంజీ టీమ్స్‌ను ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రతిభావంతమైన ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం లభిస్తుంది.'అని ఆయన పేర్కొన్నారు.
మూడు భాగాలు విభజించాలి..
ప్రస్తుతం జరుగుతున్న యూపీటీ20 లీగ్‌లో పూర్వాంచల్, మిడిల్ యూపీ ప్రాంతాల ఆటగాళ్లను విస్మరించారని అరవింద్ సింగ్ ఆరోపించారు. లీగ్‌లో పాల్గొంటున్న 6 జట్లలోని 150 మంది ఆటగాళ్లలో ఈ ప్రాంతానికి చెందిన వారు కేవలం 16 మంది మాత్రమే ఉన్నారని, పశ్చిమ యూపీ నుంచి 89 మంది, ఢిల్లీ నుంచి 8 మంది ఆటగాళ్లు ఆడుతున్నారని తెలిపారు. ఈ వివక్ష వైఖరి కారణంగానే తాము నిరసన చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిరస చేపడుతామని హెచ్చరించారు. వేలాది మంది ఆటగాళ్లు పోటీపడే వాతావరణంలో.. కొద్ది మందికి మాత్రమే అవకాశం దక్కుతుందని, ఇది తమ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని ఆటగాళ్ల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ క్రికెట్ అసోసియేషన్‌ను విభజించి మూడు రంజీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడమే తమ ఏకైక లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

