Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. తొలి ఆటగాడిగా అరుదైన రికార్డ్!

టీమిండియా యువ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) చరిత్రలో విదేశీ గడ్డపై ఏడు అంత కంటే తక్కువ స్థానంలో ఆడి అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా శ్రీలంక గడ్డపై ఏడో స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా గుర్తింపు పొందాడు.

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురెల్ (177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115 నాటౌట్) అజేయ శతకంతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో ధ్రువ్ జురెల్ తన పేరిట పలు రికార్డ్‌లను లిఖించుకున్నాడు.

Dhruv Jurel Creates WTC Record With Unbeaten Century Against Sri Lanka in Colombo Test

మూడో భారత బ్యాటర్‌గా..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలోనే విదేశాల్లో జరిగిన టెస్ట్‌ల్లో ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన మూడో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్. అతని కంటే ముందు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి ఈ ఫీట్ సాధించారు. 2024లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌ చేసిన నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేశాడు.

అందుకే జై జవాన్.. జై కిసాన్ సెలెబ్రేషన్స్: ధ్రువ్ జురెల్ (వీడియో)

అందుకే జై జవాన్.. జై కిసాన్ సెలెబ్రేషన్స్: ధ్రువ్ జురెల్ (వీడియో)

2022లో ఇంగ్లండ్‌తో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్ట్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా 104 పరుగులు చేశాడు. తాజాగా ధ్రువ్ జురెల్ 115 పరుగులతో అజేయంగా నిలిచి ఈ ఇద్దర్ని వెనక్కి నెట్టి ఏడు లేదా అంతకంటే తక్కవ స్థానాల్లో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన 9వ బ్యాటర్‌గా జురెల్ నిలిచాడు. ఈ జాబితాలో రిషభ్ పంత్(159) అగ్రస్థానంలో ఉన్నాడు.

తొలి ఏడో బ్యాటర్‌గా..

శ్రీలంకతో టెస్ట్‌ల్లో సెంచరీ బాదిన నాలుగో భారత వికెట్ కీపర్‌ కమ్, ఏడో బ్యాటర్‌గా కూడా ధ్రువ్ జురెల్ నిలిచాడు. అతని కంటే ముందు శ్రీలంకపై కపిల్ దేవ్, ధోనీ, రవీంద్ర జడేజా ఈ ఫీట్ సాధించారు. అయితే శ్రీలంక గడ్డపై సెంచరీబాదిన తొలి నెంబర్ 7 భారత బ్యాటర్‌గా ధ్రువ్ జురెల్ గుర్తింపు పొందాడు.

భారత్ భారీ స్కోర్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. ధ్రువ్ జురెల్(177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115 నాటౌట్), దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) సెంచరీలతో రాణించగా.. రిషభ్ పంత్(89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

సెంచరీ చేసి జై జవాన్.. జై కిసాన్ అన్న ధ్రువ్ జురెల్!(వీడియో)

Also Read

సెంచరీ చేసి జై జవాన్.. జై కిసాన్ అన్న ధ్రువ్ జురెల్!(వీడియో)

శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/106) నాలుగు వికెట్లు తీయగా..ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారాకు ఒక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

Story first published: Tuesday, August 25, 2026, 12:00 [IST]
Other articles published on Aug 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+