యశస్వి జైస్వాల్ అహాన్ని దెబ్బతీసిన హర్షా భోగ్లే.. ఆ ఒక్క మాటతో వాత పెట్టేశాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అహాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే దెబ్బతీసాడు. గాంధేయ వాదాన్ని అనుసరించి ఒకే ఒక్క మాటతో అతనికి వాత పెట్టాడు. తనను తిట్టినా.. ప్రేమతో కొనియాడి జైస్వాల్ ఇగోను టచ్ చేశాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌లో ఆ జట్టు పేసర్ అసితా ఫెర్నాండోతో యశస్వి జైస్వాల్ గొడవపడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఘటనపై క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన హర్షా భోగ్లే.. జైస్వాల్ అలా అతనిపైకి దూసుకెళ్లాల్సింది కాదని, మౌనంగా వెళ్లి పోయి ఉంటే మంచి స్పందన అయ్యేదని అభిప్రాయపడ్డాడు. అసితా ఫెర్నాండో అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదని చెప్పాడు. కానీ యశస్వి జైస్వాల్‌ను తప్పుబట్టడంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తెలియకపోతే మౌనంగా ఉండు..
అసితా ఫెర్నాండో ఏమన్నాడో తెలియకుండా తీర్పులు ఇవ్వడం సరికాదని హర్షా భోగ్లేకు జైస్వాల్ చురకలంటించాడు. తెలియకుంటే మౌనంగా ఉండాలని హితవు పలికాడు. అంతేకాకుండా ఎవరైనా హద్దులు ధాటి ప్రవర్తిస్తే.. భారత్ తిరిగి పోరాడుతుందని, వాళ్లకు గట్టిగా బదులు ఇస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని హర్షా భోగ్లే వీడియో కింద జైస్వాల్ కామెంట్ చేశాడు.
అయితే ఈ మాటలను ఏ మాత్రం పట్టించుకోని హర్షా భోగ్లే ప్రేమతోనే దిమ్మతిరిగే బదులిచ్చాడు. రెండో రోజు ఆటలో అద్వితీయమైన క్యాచ్ అందుకున్న యశస్వి జైస్వాల్‌ను కొనియాడాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.
వారెవ్వా జైస్వాల్ అదిరిపోయే క్యాచ్..
'బ్యాటింగ్ చేయడానికి ఇది అత్యంత సవాలుతో కూడుకున్న సమయం. యశస్వి జైస్వాల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ శ్రీలంక పరిస్థితిని మరింత దిగజార్చింది.'అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రేమతోనే ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయవచ్చో హర్షా భోగ్లే చేసి చూపించాడని కామెంట్ చేస్తున్నారు.
రెండో రోజు ఆట చివర్లో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 8 పరుగులే చేసింది. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో ఓపెనర్ లాహిరు ఉడానా ఇచ్చిన క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ అద్భుతంగా అందుకున్నాడు. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన జైస్వాల్.. కుడివైపు డైవ్ చేసి మరి బంతిని అందుకున్నాడు.
భారత్ భారీ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 భారీ స్కోర్ వద్ద డిక్లేర్డ్ చేసింది. ధ్రువ్ జురెల్(177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 115 నాటౌట్), దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) సెంచరీలతో రాణించగా.. రిషభ్ పంత్(89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో(4/106) నాలుగు వికెట్లు తీయగా..ప్రభాత్ జయసూర్య కేశర నువాంత్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారాకు ఒక వికెట్ దక్కింది.
జైస్వాల్, ఫెర్నాండోకు జరిమానా..
మైదానంలో వాగ్వాదానికి దిగిన జైస్వాల్, ఫెర్నాండోలపై ఐసీసీ చర్యలు తీసుకుంది. లెవెల్-1 ఉల్లంఘనగా పరిగణిస్తూ ఇద్దరికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు చెరో డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఇద్దరు ఆటగాళ్లు తమ తప్పిదాన్ని ఒప్పుకొని శిక్షలకు అంగీకరించారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

