Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్ మైండ్‌బ్లాక్‌తో చంపేసావ్.. మీకు అర్థం అవుతుందా: రష్మిక

Rashmika Mandanna applauds David Warner for dancing on her ‘Mind Block’ song
Rashmika Mandanna Applauds David Warner For Dancing On Her ‘Mind Block’ Song

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసల జల్లు కురిపించింది. కరోనాతో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ టిక్‌టాక్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానుల ఉర్రూతలూగిస్తున్నాడు. సతీమణి క్యాండిస్‌తో కలిసి అదరగొడుతున్నాడు.

అలవైకుంఠపురంతో మొదలు..

అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటలకు ఫ్యామిలీతో చిందేసి అల్లు అర్జున్‌తో పాటు అతని అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అనంతరం పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఒక్కసారి కమిటైతే 'నా మాట నేనే వినను' అనే డైలాగ్ చెప్పిన వార్నర్.. ఆ మూవీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ప్రశంసలతో పాటు సినిమా ఆఫర్‌ను అందుకున్నాడు. అనంతరం బాహుబలి సినిమాలో 'అమరేంద్ర బాహుబలి అనే నేను' డైలాగ్ చెప్పి డార్లింగ్ ఫ్యాన్స్‌ను అలరించాడు.

ఎన్టీఆర్ బర్త్‌డేకు పక్కా లోకల్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా అతని అభిమానుల కోరిక మేరకు ముందు విషెస్ చెప్పిన వార్నర్.. ఆ తర్వాత ఊహించని స్పెషల్ ట్రీట్ ఇచ్చి వారిని సంతోషంలో ముంచెత్తాడు. ఎన్టీఆర్ పక్కాలోకల్ సాంగ్‌కు సతీమణి క్యాండిస్‌తో చిందేశాడు. డ్యాన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంది సార్.. హ్యాపీ బర్త్‌డే అంటూ ఎన్టీఆర్‌ను విష్ చేశాడు.

కరోనా పోరులో మహిళా పుట్‌బాలర్.. ఎస్‌ఐ ఇందుమతి ఇక్కడా!

మహేశ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్..

ఈ క్రమంలో డేవిడ్ వార్నర్‌ను మహేశ్ బాబు అభిమానులు సరిలేరు నీకెవ్వరులోని 'మైండ్‌బ్లాక్' పాటకి టిక్‌-టాక్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఆస్ట్రేలియాలో ఆ పాట అందుబాటులో లేదని.. అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిపై వీడియో చేస్తానని వార్నర్ తెలిపాడు. మొత్తానికి ఆ పాట ఆస్ట్రేలియాలో అందుబాటులోకి రావడంతో రెండు రోజుల క్రితం ఆ పాటకు టిక్‌-టాక్ చేసి వారి ముచ్చట తీర్చాడు.

అయితే డ్యాన్స్‌ రూపంలో కాకుండా.. వార్నర్ వెరైటీగా ఈ వీడియో చేశాడు. మైండ్ బ్లాక్ అనే సాంగ్‌లో వాడిని కొట్ట‌మ‌ని చెప్పు అనే పదాలకు టిక్ టాక్ చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేస్తున్న‌ట్టు ఫోజిచ్చిన వార్న‌ర్ త‌ర్వాత మాయ‌మైయ్యాడు. 'ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య ,పిల్లలు ఉండటం మీరు విన్నారు కదా, మళ్ళీ కలుద్దాం'అని ఆ వీడియోకి క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

నవ్వు ఆగడం లేదు..

నవ్వు ఆగడం లేదు..

ఈ వీడియోను చూసి రష్మిక వార్నర్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయింది. ముఖ్యంగ తన లిరిక్స్‌కు వార్నర్ టిక్ టాక్ చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది.

వెంటనే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ను కొనియాడింది. అంతేకాకుండా ఆ వీడియోకు వార్నర్ ఇచ్చిన క్యాప్షన్ చదివితే నవ్వు ఆగడంలేదని తన ఫాలోవర్స్‌కు తెలిపింది. ‘డేవిడ్ వార్నర్ చంపేసావ్‌పో.. క్యాప్షన్ చదవుతుంటే నవ్వు ఆగడం లేదు'అని రాసుకొచ్చింది.

అనుష్కశర్మకు విరాట్ విడాకులివ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే

Story first published: Wednesday, May 27, 2020, 19:13 [IST]
Other articles published on May 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+