
పవర్‌ఫుల్‌గా యువభారత్..
అండర్-19 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన భారత్ ఈ టోర్నీలో కూడా ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. 2016లో ఫైనల్లో వెస్టిండీస్‌తో ఓటమి తర్వాత ప్రపంచకప్స్‌లో వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన యువ భారత్ సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. ప్రియమ్ గార్గ్ సారథ్యంలోని జట్టు అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా ఉంది.

సూపర్ ఫామ్‌లో యశస్వీ
పానీపురి అమ్ముకునే దశ నుంచి స్టార్‌గా ఎదిగిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలుస్తున్నాడు. టోర్నీలో 312 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పైగా సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సెంచరీ చేసి ఫుల్‌జోష్‌లో ఉన్నాడు. అతని ఓపెనింగ్ పార్ట్‌నర్ దివ్యాన్ష్ సక్సేనా కూడా ఫామ్‌లో ఉండగా.. వన్‌డౌన్‌లో మరో టాలెంటెడ్ లెఫ్టాండర్, హైదరాబాద్ ఠాకూర్ తిలక్ వర్మతో టాపార్డర్ బలంగా ఉంది. వీరిలో ఒక్కరు క్రీజులో నిలిచినా భారీ స్కోరు ఖాయమే. కీపర్ ధ్రువ్ జురెల్, కెప్టెన్ ప్రియమ్ గార్గ్‌తో పాటు ఆల్‌రౌండర్లు సిద్దేశ్ వీర్, అథర్వ అంకోలేకర్‌తో మిడిల్, లోయరార్డర్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.
రికార్డుల రారాజు 'విరాట్ కోహ్లీ'ని ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్ ఎవరో తెలుసా?!!

ప్రధాన ఆయుధం బౌలింగ్..
ఇండియా ప్రధాన ఆయుధం బౌలింగే. పేసర్లు కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా, ఆకాశ్ సింగ్ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిలకడగా బౌలింగ్ చేస్తున్న కార్తీక్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నాడు. ఇక, లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌తో కూడుకున్నదే. అతనికి అంకోలేకర్ నుంచి మంచి సహకారం లభిస్తోంది. తొలి మ్యాచ్‌లో 298 రన్స్ ఛేజింగ్‌లో శ్రీలంక 207 రన్స్ చేయడం మినహా మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థిని 200లోపే ఆలౌట్ చేసిందంటే భారత్ బౌలింగ్ ఎంత పదునుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే ఐదో కప్పు కూడా మన ఖాతాలో చేరినట్టే.

బంగ్లా తక్కువేం కాదు
తొలిసారి ఫైనల్‌కు వచ్చినప్పటికీ బంగ్లాదేశ్ కూడా టోర్నీలో ఇప్పటిదాకా అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆ జట్టులో కూడా మ్యాచ్ విన్నర్లకు కొదువలేదు. యశస్వి మాదిరిగా బంగ్లా టాపార్డర్‌లో తన్‌జిత్ హసన్ అదరగొడుతున్నాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో సెంచరీ హీరో మహ్ముదుల్ హసన్ జాయ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక, స్పిన్నర్ రకిబుల్ హసన్ మంచి ఫలితాలను రాబట్టాడు. తన్జిమ్ హసన్, షోరిఫుల్ ఇస్లామ్‌తో పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మినహా బంగ్లా టాపార్డర్ టోర్నీలో నిలకడగా ఆడింది. రెండు జట్లు సెమీస్‌లో ఆడిన ఆటగాళ్లతోనే బరిలోకి దిగే చాన్సుంది.

హోరాహోరీగా సాగినా.. భారత్‌దే పై చేయి..
ఈ మ్యాచ్‌లో యువ భారత్ గెలిస్తే ఐదో కప్పుతో తన రికార్డును మరింత మెరుగు పరుచుకోనుంది. ప్రస్తుతానికి భారత్ తర్వాత మూడు కప్పులతో ఆస్ట్రేలియాది రెండో స్థానంలో ఉంది. ఒకవేళ బంగ్లా గెలిస్తే ఏ లెవెల్లో అయినా దానికిదే తొలి ప్రపంచకప్ కానుంది. గత ప్రపంచ కప్ తర్వాత భారత్, బంగ్లాదేశ్ జట్లు అండర్-19 విభాగంలో 7 సార్లు తలపడ్డాయి. ఇందులో 2 మ్యాచ్‌లు వర్షంతో రద్దు కాగా... మిగిలిన ఐదు మ్యాచ్‌లలో 4 గెలిచిన భారత్ 4-1తో ఆధిక్యంలో ఉంది. 2018 ఆసియా కప్ సెమీఫైనల్లో, 2019 ఆసియా కప్ ఫైనల్లో భారత్‌నే విజయం వరించింది. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన పోరులో బంగ్లాదేశ్ 2 వికెట్లతో భారత్‌ను ఓడించింది.
రెండో వన్డేలో పోరాడిన జడేజా, సైనీ.. భారత్‌కు తప్పని పరాభవం.. సిరీస్ కివీస్ కైవసం!!

వాన ముప్పు.. రేపు రిజర్వ్ డే
ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఆదివారం, రిజర్వ్ డే అయిన సోమవారం ఏదో ఒక సమయంలో భారీ వర్షం వచ్చే చాన్సుంది. తొలి రోజు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. అక్కడి నుంచే రిజర్వ్ డే రోజు ఆట కొనసాగిస్తారు. రెండు రోజుల్లోనూ ఆట సాధ్యం కాకపోతే ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.

పిచ్ ఎలా ఉందంటే..
భారత్-పాకిస్థాన్ సెమీస్ జరిగిన పిచ్‌నే ఈ మ్యాచ్‌కూ వాడనున్నారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు కూడా అనుకూలించిన పిచ్ స్వభావంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మధ్యాహ్నం గం.1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-3లో ప్రత్యక్ష ప్రసారం
జట్లు (అంచనా)
ఇండియా: యశస్వి, దివ్యాంశ్ సక్సేనా, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ (కీపర్), ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), సిద్దేశ్ వీర్, అథర్వ అంకోలేకర్, రవి బిష్నోయ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, ఆకాశ్ సింగ్.
బంగ్లాదేశ్: పర్వేజ్, తన్జిద్ హసన్, మహ్ముదుల్ హసన్, తౌహిత్ హ్రిదాయ్, షహదత్ హుస్సేన్, షమీమ్ హుస్సేన్, అక్బర్ అలీ (కెప్టెన్, కీపర్), రకిబుల్ హసన్, షోరిఫుల్ ఇస్లాం, తన్జిమ్ హసన్ షకీబ్, హసన్ మురాద్.


Click it and Unblock the Notifications












