Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాపార్డర్‌లో ఆడటమే ఇష్టం.. లోయారార్డర్‌లో కష్టం: తిలక్ వర్మ

తాను టాపార్డర్‌లో ఆడేందుకే ఇష్టపడుతానని టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. మూడో స్థానం తన ఫేవరేట్ అని చెప్పుకొచ్చాడు. టాపార్డర్ బ్యాటర్ లోయరార్డర్‌లో ఆడటం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. జట్టు కోసం తప్పదంటే.. లోయరార్డర్‌లో రాణించేందుకు మరింత శ్రమిస్తానని కూడా తిలక్ వర్మ వెల్లడించాడు.

ఆసియా గేమ్స్ 2026లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే తిలక్ వర్మ గతంలో టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. ఫస్ట్ డౌన్ లేదా నాలుగు, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. కానీ ఇప్పుడు టీమ్ కాంబినేషన్‌లో భాగంగా లోయరార్డర్‌లో ఆడుతున్నాడు.

Asian Games 2026: తెలుగు సైన్యం ఇదే!

Asian Games 2026: తెలుగు సైన్యం ఇదే!

ఫస్ట్ డౌన్‌లో ఆడటం ఇష్టం..

లోయరార్డర్‌లో ఆడటం కష్టంగా ఉన్నా జట్టు కోసం తప్పదంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తిలక్ వర్మ పేర్కొన్నాడు. ' జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను రెడీ. చిన్నప్పుడు నేను ఓపెనర్. ఇప్పడు మళ్లీ ఓపెనర్‌గా ఆడమంటే రెడీ. నాకు ఫస్ట్ డౌన్‌లో ఆడటమంటే చాలా ఇష్టం. టాపార్డర్‌లో మార్పులు చేసుకోవడం సులువే. పెద్ద తేడా ఏం ఉండదు.

Tilak Varma Says He Likes Batting at No 3 Reveals What He Learned From Rohit Sharma

నాలుగో స్థానం వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ టాపార్డర్ బ్యాటర్.. 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేయాలంటేనే కష్టమవుతుంది. జట్టుకు అవసరమై.. మరో ఆప్షన్ లేదంటే అక్కడే ఆడుతా. అందుకోసం నేను బాగా కష్టపడుతా. లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేసేటప్పటికి బంతి పాతబడిపోతుంది. బౌలర్లు కూడా యార్కర్లు, స్లోయర్లతో వైవిధ్యమైన బంతులు వేస్తారు. నేను మానసికంగా అందుకు సిద్దమవుతా. ఒక్క మ్యాచ్‌లో బాగా ఆడితే చాలు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.'అని తిలక్ వర్మ తెలిపాడు.

రోహిత్ కెప్టెన్సీ నన్ను మార్చేసింది..

సారథ్య లక్షణాలను అందుకోవడంలో రోహిత్, విరాట్ పరోక్షంగా సాయపడ్డారని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ తనను పూర్తిగా మార్చేసిందని వెల్లడించాడు. 'నేను కోహ్లీ భాయ్ సారథ్యంలో ఆడలేదు. రోహిత్ భాయ్ నాయకత్వంలోనే ఎక్కువగా ఆడా. భారత జట్టుతో పాటు ముంబై ఇండియన్స్‌లో అతని సారథ్యాన్ని దగ్గరగా చూశా. ఎన్నో విషయాలను నేర్చుకున్నా.

IND vs WI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! విండీస్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! విండీస్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

మైదానంలో రోహిత్ నిబద్ధత అద్భుతం. ఆ సమయంలో రోహిత్‌ భాయ్‌తో నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత చాలా విషయాలపై చర్చించేవాడిని. రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నప్పుడు నేను ఎక్కువగా డగౌట్‌కే పరిమితమయ్యాను. బెంచ్‌పై కూర్చొని వారి ఆటను గమనించేవాడిని. కెప్టెన్‌గా రోహిత్ బౌలర్లను ఎలా మారుస్తున్నాడు?అనేది నిశితంగా పరిశీలించేవాడిని. 'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, October 8, 2026, 14:15 [IST]
Other articles published on Oct 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+