IND vs WI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! విండీస్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాంచీ వేదికగా శుక్రవారం జరిగే రెండో టీ20లో విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఏకపక్షంగా సాగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా.. అదే జోరులో రెండో మ్యాచ్ గెలవాలని భావిస్తోంది.
మరోవైపు తొలి మ్యాచ్ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో టీ20లో సత్తా చాటాలని విండీస్ ఉవ్విళ్లూరుతోంది. దాంతో భారత దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇలాకాలో జరిగే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైభవ్‌కు అవకాశం దక్కెనా..?
రెండో టీ20లో టీమిండియా కాంబినేషన్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. 9, 7, 2, 11 వరుసగా నాలుగు టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించి ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించవచ్చు. ఒకవేళ సంజూకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమవుతాడు.

ఆసియా గేమ్స్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా ఆకట్టుకున్నాడు. కానీ వరల్డ్ కప్ గెలిపించిన ఓపెనింగ్ కాంబినేషన్‌ను విడదీయలేమని, వైభవ్ వేచిచూడాల్సిందేనని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సిరీస్ ప్రారంభానికి ముందు తెలిపాడు. ఈ విషయాన్ని వైభవ్‌కు కూడా తెలియజేసినట్లు చెప్పాడు.
ప్రిన్స్ యాదవ్‌కు చోటు..?
ఓపెనింగ్ జోడీ మినహా మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే తొలి టీ20లో ధారళంగా పరుగులిచ్చుకున్న మయాంక్ యాదవ్‌ను తప్పించాలనుకుంటే మాత్రం ప్రిన్స్ యాదవ్‌కు చోటు దక్కుతుంది. లేదంటే అతనికి మరోసారి నిరాశే ఎదురవ్వనుంది. నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఈ ముగ్గురు తొలి మ్యాచ్‌లో సత్తా చాటారు. అరంగేట్ర మ్యాచ్‌లో నమన్ ధీర్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. దాంతో రవి బిష్ణోయ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ప్రధాన పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నమన్ ధీర్, అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అభిషేక్ శర్మతో కలిసి వైభవ్, సంజూలో ఒకరు ఓపెనింగ్ చేయనున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా నితీష్ కుమార్ రెడ్డి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత తుది జట్టు(అంచనా)
వైభవ్ సూర్యవంశీ/సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్/ప్రిన్స్ యాదవ్.
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


