పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగుతో చేజారిన శతకం! ఈస్ట్ జోన్‌దే దులీప్ ట్రోఫీ!
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మను దురదృష్టం వెంటాడింది. ఒక్క పరుగు దూరంలో అతని శతకం చేజారింది. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో సౌత్‌జోన్‌కు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ 99 పరుగుల వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. జట్టు బ్యాటర్లంతా చేతులెత్తేసిన వేళ ఒంటరి పోరాటం కనబర్చిన తిలక్ వర్మ.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది.
తిలక్ వర్మ(211 బంతుల్లో 9 ఫోర్లతో 99) పాటు దేవదత్ పడిక్కల్(104 బంతుల్లో 4 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. చామ మిలింద్(68 బంతుల్లో 7 ఫోర్లతో 43) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు నిరాశపర్చారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(3/62) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/42), ఖరైషి(2/99), శిఖర్ మోహన్ (2/67) రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఈస్ట్ జోన్‌దే టైటిల్..
తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. దాంతో సౌత్ జోన్ ఫాలో-ఆన్ ఆడే పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్ డ్రా అయినా.. రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్‌నే టైటిల్ వరించనుంది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ గెలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడితే మ్యాచ్ డ్రా కానుంది. లేదంటే ఈస్ట్ జోన్ భారీ విజయం సాధిస్తుంది.

వరుసగా వికెట్లు కోల్పోయి..
242/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. నిలకడగా తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తిలక్ వర్మ, చామ మిలింద్ ఈస్ట్ జోన్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని శిఖర్ మోహన్ విడదీయగా.. త్రిపురణ విజయ్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు.
దాంతో నాలుగో రోజు ఆటలో 4 పరుగుల వ్యవధిలోనే సౌత్ జోన్ రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్(1) నిరాశపర్చడంతో తిలక్ వర్మపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే ఖురైషి బౌలింగ్‌లో భారీ షాట్‌తో సెంచరీ పూర్తి చేయాలనుకున్న అతని ప్లాన్ విఫలమైంది. నేరుగా ఖురైషికే క్యాచ్ ఇవ్వడంతో సౌత్ జోన్ ఇన్నింగ్స్ ముగిసింది. దాంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు.
ఈస్ట్ జోన్ రికార్డ్ స్కోర్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్‌లతో 270)తో డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగాడు. శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు.
వైభవ్ సూర్యవంశీ(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) దూకుడుగా ఆడాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్(4/180) నాలుగు వికెట్లు తీయగా.. చామ మిలింద్, శ్రేయస్ గోపాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


