Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను జట్టులో ఉండటం మా అదృష్టం: ఇషాన్ కిషన్

టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీపై ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనిలాంటి ఆటగాడు జట్టులో ఉండటం తమ అదృష్టమని తెలిపాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు షమీ ఆకలితో ఉన్నాడని చెప్పాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఫైనల్లో సౌత్ జోన్‌తో ఈస్ట్ జోన్ తలపడనుంది.

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఇషాన్ కిషన్.. 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడబోతున్న షమీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. షమీ భారత క్రికెట్‌లో ఒక దిగ్గజమని, గత మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రెండు అద్భుతమైన బౌండరీలు కొట్టాడని, ఇప్పుడు అతను ఆల్‌రౌండర్ అయిపోయాడని సరదాగా వ్యాఖ్యానించాడు.

Ishan Kishan Praises Mohammed Shami s Hunger and Desire to Return to India Team ahead of Duleep Trophy 2026 Final

షమీ ఓ దిగ్గజం..

'మహమ్మద్ షమీ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఈ ఆటలో దిగ్గజం. బెంగాల్ తరఫున తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి వికెట్లు తీస్తూ తన పూర్తి శక్తిని ధారపోస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకు కూడా తన బౌలింగ్‌తో ఎన్నో విజయాలు అందించాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమేనని నేను భావిస్తాను. కష్టపడుతున్నంత కాల వయసు లెక్కలోకి రాదు. మూడేళ్ల క్రితం వరల్డ్ కప్‌లో చూసిన ఆ కసి, గెలిపించాలనే తపన షమీలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

Duleep Trophy 2026: గెలిపించిన వైభవ్ సూర్యవంశీ.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఈస్ట్ జోన్!

Also Read

Duleep Trophy 2026: గెలిపించిన వైభవ్ సూర్యవంశీ.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఈస్ట్ జోన్!

ప్రస్తుతం అతను చాలా బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా అతను మా జట్టులో ఉండటం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఓ కెప్టెన్‌గా అతని ప్రయత్నాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే షమీ భాయ్ స్వయంగా వచ్చి వికెట్లు తీయడానికి అదనపు ఓవర్లు వేస్తానని అడుగుతాడు. ఇది కెప్టెన్‌లకు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వికెట్లు తీసేందుకు బౌలర్లు సిద్దంగా ఉంటే కెప్టెన్ పని సులువు అవుతుంది. అలాంటి ప్లేయర్ జట్టులో ఉండటం మా అదృష్టం.

షమీ ఆల్‌రౌండర్..

బౌలింగ్‌తోనే కాకుండా బ్యాటింగ్‌తోనూ సత్తా చాటే సామర్థ్యం షమీ భాయ్‌కు ఉంది. గత మ్యాచ్‌లో అతను రెండు బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. నా దృష్టిలో అతను ఓ ఆల్‌రౌండర్(నవ్వుతూ). ఈ సీజన్‌లో షమీ భిన్నంగా కనిపిస్తున్నాడు. ఆట పట్ల అతని వైఖరి, తీవ్రత, శక్తి అన్ని చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. భారత జట్టుకు ఆడనప్పుడు దేశవాళీ క్రికెట్‌లో అదే రకమైన ప్రేరణను పొందడం చాలా కష్టం. తిరిగి జట్టులోకి రావాలనే తపన, ప్రేరణ షమీ భాయ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

Recommended For You

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

ఓ సీనియర్ ఆటగాడిగా అతను నాకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జట్టు విజయం కోసం నా దగ్గరకు వచ్చి సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. మా కుర్రాళ్లంతా విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకే మాకు విజయాలు దక్కాయి. వైభవ్ సూర్యవంశీ చాలా తెలివైన ఆటగాడు. మైదానంలో ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. సెమీఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.'అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, September 5, 2026, 17:31 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+