IND vs ZIM: నిప్పులు చెరిగిన వైష్ణవి శర్మ.. 131 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వే!
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో వడోదర వేదికగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ(5/39) నిప్పులు చెరిగింది. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 39.5 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది.
ఓపెనర్ మోడెస్టర్ ముపాచిక్వా(48 బంతుల్లో 7 ఫోర్లతో 37), కెప్టెన్ జోసెఫిన్ న్కోమో (67 బంతుల్లో 4 ఫోర్లతో 35) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో వైష్ణ వి శర్మతో పాటు క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే ఈ సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంపై భారత్ ఫోకస్ పెట్టింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకు ఆదిలో బిగ్ షాక్ తగిలింది. సయాలీ సత్ఘరే వేసిన రెండో ఓవర్‌లోనే జింబాబ్వే ఓపెనర్ లారిన్ ఫిరి(0) డకౌట్‌గా వెనుదిరిగింది. ఆ వెంటనే చిపో ముగేరి(4)ని క్రాంతి గౌడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. ఈ పరిస్థితుల్లో మోడెస్టర్ ముపాచిక్వా, బిలవ్‌డ్ బిజా(1) ఆచితూచి ఆడారు. అయితే తీవ్రంగా తడబడిన ఈ జోడీని వైష్ణ విశర్మ విడదీసింది. దాంతో పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 30 పరుగులు మాత్రమే చేసింది. టెస్ట్ తరహా బ్యాటింగ్‌తో భారత బౌలర్లను జింబాబ్వే బ్యాటర్లు విసిగించారు. కానీ వైష్ణవి శర్మ అద్భుత బ్యాటింగ్‌తో వారిని పెవిలియన్ చేర్చింది.
ఆచితూచి ఆడిన మోడెస్టర్ ముపాచిక్వా(37)ను వైష్ణవి శర్మ స్టంపౌట్‌గా పెవిలియన్ చేర్చగా.. కెప్టెన్ జోసెఫిన్ న్కోమో, చీడ్జా ధురురు ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. చీడ్జా ధురురు(20) వైష్ణవి శర్మ క్యాచ్ ఔట్ చేయగా.. జింబాబ్వే ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. మిచెల్లే(6), గ్వాంజురాలను వైష్ణవి శర్మ ఔట్ చేయగా.. జోసెఫిన్‌ను క్రాంతి గౌడ్ పెవిలియన్ చేర్చింది. సిబండా(3) రనౌట్‌గా వెనుదిరగడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ ముగిసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


