ఉప్పల్ నా అడ్డా.. అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు పరుగెత్తుతా: తిలక్ వర్మ
ఉప్పల్ స్టేడియం తన అడ్డా అని టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అన్నాడు. తనతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకు హోమ్ గ్రౌండ్ లాంటిదని, ఇది జట్టుకు ఉపయోగపడుతుందని తెలిపాడు.
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా నాలుగో టీ20కి సిద్దమైంది. బుధవారం ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్నాయి. మంగళవారం స్టేడియంలో ముమ్మరంగా సాధన చేశాయి. ప్రాక్టీస్ సెషన్ అనంతరం తిలక్ వర్మ మీడియాతో మాట్లాడాడు.
ఉప్పల్ మాకు హోమ్ గ్రౌండ్..
తన హోమ్ గ్రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందిస్తానని తెలిపాడు. మూడో టీ20లో రనౌట్ అవ్వడంపై తిలక్ వర్మ విచారం వ్యక్తం చేశాడు. దురదృష్టకర రీతిలో రనౌట్ కావాల్సి వచ్చిందని చెప్పాడు. భవిష్యత్తులో అంపైర్ బౌండరీ సిగ్నల్ ఇచ్చే వరకు పరుగెత్తుతూనే ఉంటానని తెలిపాడు.

'హైదరాబాద్‌లో పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. కానీ ఈ సారి పిచ్ మార్చామని చెబుతున్నారు. కొత్త వికెట్ ఎలా స్పందిస్తుందో అనేది చూడాలి. బ్యాటింగ్, బౌలింగ్‌లో మేం దూకుడుగా ఆడుతున్నాం. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలతో పాటు నాకు హైదరాబాద్ హోమ్ గ్రౌండ్‌లాంటిది. అది జట్టుకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు పరుగెత్తుతా..
నాకు నెంబర్ 3లోనే బ్యాటింగ్ చేయడం ఇష్టం. కానీ ప్రస్తుతం నా అవసరం మిడిలార్డర్‌లో ఉంది. అందుకే మిడిలార్డర్‌లో ఆడుతున్నా. గత మ్యాచ్‌లో నేను దురదృష్టకర రీతిలో రనౌట్ అయ్యాను. బంతి బౌండరీ వెళ్లిందని పొరబడ్డాను. బౌండరీ లైన్ హోర్డింగ్ ఫ్లాష్ అయ్యింది.
దాంతోనే బౌండరీ వెళ్లిందనుకున్నా. ఇక నుంచి అంపైర్ బౌండరీ సిగ్నల్ ఇచ్చే వరకు పరుగెత్తుతా. టీ20 ఫార్మాట్‌లో వెస్టిండీస్ మంచి టీమ్. ఆఖరి ప్లేయర్ వరకు హార్డ్ హిట్టింగ్ చేస్తారు. కాబట్టి వెస్టిండీస్‌పై పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో బరిలోకి దిగాలి.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


