అయ్యగారు బీచ్‌లో నడుస్తున్నట్లు నడిచాడు.. తిలక్ వర్మ రనౌట్‌పై మాజీ క్రికెటర్ ఫైర్!
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మపై మాజీ క్రికెటర్ సదగొప్పన్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటపై కనీస అవగాహన లేకుంటే ఎలా? అని ప్రశ్నించాడు. బీచ్‌లో నడిచినట్లు నడిచి రనౌట్ అయ్యాడని ఘాటుగా విమర్శించాడు.
వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ విచిత్రకర రీతిలో రనౌటయ్యాడు. గుడకేష్ మోతీ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ ఫ్లిక్ షాట్ ఆడగా.. బంతి స్క్వేర్ లెగ్ బౌండరీ దిశగా దూసుకెళ్లింది. విండీస్ ఫీల్డర్ కమిల్ పూరన్ డైవ్ చేసి బంతిని అడ్డుకున్నాడు. అయితే ఇది బౌండరీ అని భావించిన భారత ఆటగాళ్లు క్రీజు మధ్యలో ఆగి చేతులతో ట్యాపింగ్ చేసుకున్నారు.
బీచ్‌లో నడుస్తున్నట్లు నడిచాడు..
బంతిని ఫీల్డర్ అడ్డుకోవడం చూసిన అక్షర్ పటేల్ అప్రమత్తమవ్వగా.. తిలక్ వర్మ మాత్రం గ్రహించలేకపోయాడు. దాంతో నాన్‌స్ట్రైక్ ఎండ్ వైపు తిలక్ వర్మ రనౌటయ్యాడు. ఈ రనౌట్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన సదగొప్పన్ రమేష్.. తిలక్ వర్మ తీరును తప్పుబట్టాడు. చాలా అత్యంత అరుదుగా జరిగే ఈ తరహా రనౌట్‌ను జనాలు మరిచిపోరని తెలిపాడు.

'బౌండరీని అడ్డుకునే ప్రయత్నాలు జరిగినప్పుడు అంపైర్లు కూడా థర్డ్ అంపైర్ సమీక్ష కోరే బౌండరీ ఇస్తారు. అలాంటిది తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అది బౌండరీ అని ఎలా ఫిక్స్ అయ్యారు? పోనీ అక్షర్ పటేల్ అయినా ఆ తర్వాత కాస్త అప్రమత్తమయ్యాడు. కానీ తిలక్ వర్మ మాత్రం అసలు ఏం జరుగుతుందో పట్టించుకోకుండా బీచ్‌లో సరదాగా వాకింగ్ చేస్తున్నట్లు కనిపించాడు.
గాయింత సోయి లేకుంటే ఎలా..?
సాధారణంగా ఫీల్డర్లు బౌండరీ సేవ్ చేసేటప్పుడు అంపైర్లు వెంటనే థర్డ్ అంపైర్ సాయం కోరుతారు. ఎందుకంటే పిచ్‌కి, బౌండరీకి మధ్య చాలా దూరం ఉంటుంది కాబట్టి.. ఫీల్డర్ కాళ్లు బౌండరీ లైన్‌కు తగిలాయా? లేదా? అని తెలుసుకుంటారు. అంపైర్లు తమ నిర్ణయం చెప్పే వరకు బంతి ఇన్ ప్లేలోనే ఉంటుంది.
ఈ మ్యాచ్‌లో ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలు జరిగినప్పటికీ.. అందరికీ తిలక్ వర్మ రనౌట్ బాగా గుర్తిండిపోతుంది. భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లినా కూడా.. క్రికెట్‌లో ఇలాంటి రనౌట్స్ చాలా తక్కువగా జరుగుతాయి. కాబట్టి ఇది అందరి మైండ్‌లో ఉండిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


