Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే మా పతనానికి కారణం: తిలక్ వర్మ

బౌలింగ్ వైఫల్యమే తమ పతనాన్ని శాసించిందని సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. తమ బౌలింగ్ వైఫల్యంతో ఈస్ట్ జోన్ 700 పరుగులు చేయగలిగిందని, ఆ భారీ స్కోర్‌ను ఛేజ్ చేయడం కష్టంగా మారిందని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌ను ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ సొంతం చేసుకుంది.

చెన్నై వేదికగా సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్‌ను టైటిల్ వరించింది. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన తిలక్ వర్మ.. బౌలింగ్ వైఫల్యమే తమ పతనాన్ని శాసించిందని చెప్పుకొచ్చాడు.

Tilak Varma Blames Poor Bowling for South Zone s Defeat Against East Zone in Duleep Trophy 2026 Final

708 పరుగులు చేయడంతోనే..

'ఈ మ్యాచ్ ఫలితం మాకు చాలా నిరాశ కలిగించింది. తొలి రోజు మేం బాగానే ఆడాం. కానీ వాళ్ళు 700 పరుగులు చేశాక.. ఆ స్కోరును ఛేజ్ చేయడం కొంచెం కష్టంగా మారింది. వాళ్ళ బ్యాటర్లను మెచ్చుకోవాల్సిందే. నిజం చెప్పాలంటే మేం అంత బాగా బౌలింగ్ చేయలేదు. నిజానికి మేం మూడు రోజుల పాటు బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. 700 పరుగులు చేయడానికి మా సాయశక్తులా ప్రయత్నించాం. కానీ ఈస్ట్ జోన్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఈ గెలుపు క్రెడిట్ అంతా ఈస్ట్ జోన్‌కే దక్కుతుంది. వాళ్ళు మమ్మల్ని పూర్తిగా చిత్తుగా ఓడించారు.'అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.

తిలక్ వర్మ.. గెలికి తన్నించుకోవడం అంటే ఇదే బ్రో!

తిలక్ వర్మ.. గెలికి తన్నించుకోవడం అంటే ఇదే బ్రో!

ఈస్ట్ జోన్‌దే ఆధిపత్యం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. కుమార్ కుశాగ్ర(101) సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులే చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ(99) తృటిలో శతకం చేజార్చుకోగా.. దేవదత్ పడిక్కల్(62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

మహమ్మద్ షమీని ధీటుగా ఎదుర్కొంటాం: తిలక్ వర్మ

Also Read

మహమ్మద్ షమీని ధీటుగా ఎదుర్కొంటాం: తిలక్ వర్మ

372 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్.. రెండో ఇన్నింగ్స్‌లో 99.2 ఓవర్లలో 7 వికెట్లకు 388 పరుగులు వద్ద డిక్లేర్ చేసింది. ఖురైషి(116 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. ఇషాన్ కిషన్(80), శిఖర్ మోహన్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌత్ జోన్ ముందు 761 పరుగుల లక్ష్యం నమోదు కాగా.. ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్‌ను విజేతగా ప్రకటించారు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Story first published: Thursday, September 10, 2026, 18:45 [IST]
Other articles published on Sep 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+