మహమ్మద్ షమీని ధీటుగా ఎదుర్కొంటాం: తిలక్ వర్మ
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ కోసం అన్ని విధాల సిద్దమయ్యామని సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. మహమ్మద్ షమీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం చెన్నై వేదికగా ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ సారథ్యంలో ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న తిలక్ వర్మ.. సౌత్ జోన్ తరఫున కేఎల్ రాహుల్ ఆడటం లేదని స్పష్టం చేశాడు. దేవదత్ పడిక్కల్‌తో పాటు సిరాజ్ బరిలోకి దిగుతున్నారని చెప్పాడు.
షమీని ఎదుర్కొంటాం..
'సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని అడ్డుకునేందుకు సిద్ధంగానే ఉన్నాం. ఈ మ్యాచ్ రసవత్తరంగానే ఉండబోతుంది. గత మ్యాచ్‌లో షమీ ఎలా బౌలింగ్ చేశాడో మేం గమనించాం. బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొని సత్తా చాటుతాం. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ఆడటం లేదు.'అని తిలక్ వర్మ తెలిపాడు.

54 ఏళ్ల తర్వాత..
54 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. ఈ ఇరు జట్లు దులీప్ ట్రోఫీ ఫైనల్లో తలపడటం ఇది రెండోసారి మాత్రం. చివరి సారిగా 1970-71 సీజన్‌లో ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సౌత్ జోన్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఓవరాల్‌గా సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ చేరడం ఇది 24వ సారి. ఇప్పటి వరకు సౌత్ జోన్ 13 టైటిళ్లు గెలిచింది. మరోవైపు 13 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన ఈస్ట్ జోన్.. చివరి సారిగా 2012-13 సీజన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు 8 సార్లు ఫైనల్ చేరిన ఈస్ట్ జోన్ రెండు టైటిళ్లు మాత్రమే గెలిచింది.
ఫైనల్‌కు అగార్కర్..
ఈ ఫైనల్ మ్యాచ్‌కు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హాజరుకానున్నాడు. అతని పదవీకాలంపై ఇటీవల పెద్ద చర్చే జరిగింది. అక్టోబర్ 4 వరకు ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు పొడిగించే అవకాశం ఉంది. ఈ విషయంపై చెన్నైలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా-అగార్కర్ మధ్య సమావేశం జరగనుంది.
ఇటీవల బీసీసీఐ నిర్వహించిన రివ్యూ మీటింగ్‌కు అగార్కర్ హాజరు కాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల అతను ఈ మీటింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఆసియా గేమ్స్ కోసం నెట్ బౌలర్లను ఎంపిక చేయనున్నారు. మయాంక్ యాదవ్, కార్తిక్ త్యాగితో పాటు మోహ్‌సిన్ ఖాన్‌కు అవకాశం రానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


