IND vs NZ: తెలుగులో తిట్టుకున్న నితీష్ రెడ్డి, తిలక్ వర్మ!(వీడియో)
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన రెండో టీ20లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా తెలుగు తేజాలు నితీష్ రెడ్డి, తిలక్ వర్మ మధ్య క్విక్ డబుల్ విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కూడా ఆఖరి ఓవర్‌లో.. భారత్ విజయానికి చేరువైన సమయంలో కావడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.
అయితే ఈ సంభాషణ తెలుగులో ఉండటం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇద్దరు క్రికెటర్లు తెలుగులో మాట్లాడుకోవడం చూడ ముచ్చటగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఈ తెలుగు పదాల మధ్య తెలుగు తేజాలు మ్యాచ్‌ను ముగించడం గొప్పగా ఉందని, రోమాలు నిక్కబొడిచాయని తెలుగు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?
జాకోబ్ డఫీ వేసిన ఆఖరి ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్ విజయానికి చివరి 6 బంతుల్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి బంతి ఆడిన నితీష్ రెడ్డి క్విక్ సింగిల్ తీసాడు. రెండో బంతిని బౌండరీకి తరలించిన తిలక్ వర్మ.. మూడో బంతికి క్విక్ డబుల్ తీసాడు. నాలుగో బంతికి కూడా క్విక్ డబుల్‌కు ప్రయత్నించాడు. కానీ బంతి ఫీల్డర్ చేతిలో పడటం గమనించిన నితీష్ రెడ్డి రెండో పరుగుకు నిరాకరించాడు. దాంతో సగం క్రీజు వరకు వచ్చిన తిలక్ వర్మ నాన్‌స్ట్రైకర్ వైపు వెళ్లిపోయాడు.
డబుల్ ఎందుకు తీయలేదంటూ నితీష్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశాడు. బంతి ఫీల్డర్ చేతిలో ఉందని నితీష్ రెడ్డి చెప్పగా.. 'నేను ముందుకు వచ్చి నీ కోసం వేచి చూస్తున్నాను'అని తిలక్ వర్మ అనడం స్టంప్ మైక్‌లో వినిపించింది. మరుసటి బంతిని డఫీ వైడ్ వేయగా.. ఐదో బంతికి నితీష్ రెడ్డి క్విక్ డబుల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన భారత్‌కు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


