Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: నాకే కాదు.. అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలి: తిలక్ వర్మ

న్యూజిలాండ్‌తో రెండో టీ20 విజయంలో నమన్ ధీర్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలని టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అన్నాడు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డితో కలిసి మ్యాచ్‌ను ముగించడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన భారత్‌కు తెలుగు తేజాలు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు.

IND vs NZ: ఓడిపోయే మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన తెలుగోళ్లు!

IND vs NZ: ఓడిపోయే మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన తెలుగోళ్లు!

అజేయ హాఫ్ సెంచరీతో రాణించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన తిలక్ వర్మ.. తమ ఛేజింగ్ ప్రణాళికలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు గౌతమ్ గంభీర్ తనతో అన్న మాటలు ఈ విన్నింగ్ నాక్‌కు కారణమయ్యాయని చెప్పాడు. ఏది ఏమైనా ఆఖరి వరకు క్రీజులో ఉండి పోరాడాలనుకున్నానని చెప్పాడు.

Tilak Varma Credits Naman Dhir After India s Win Reveals Batting Plan After Five Wickets Fell In 2nd T20I

గంభీర్ సర్ మాటలతో..

'ఐదు వికెట్లు కోల్పోయాక చివరి వరకు క్రీజులో ఉండాలని అనుకున్నా. ఈ మ్యాచ్‌కు ముందే కోచ్ గౌతమ్ గంభీర్ సర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌ సర్‌తో మాట్లాడాను. వాళ్లు నాకు ఒక్కటే చెప్పారు. 'మాకే కాదు.. ఈ దేశం మొత్తానికి నీపై నమ్మకం ఉంది. నువ్వు ఆఖరి వరకు క్రీజులో ఉంటే కచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తావు'అని అన్నారు. ఈ మాటలు నా మదిలో తిరిగాయి. మ్యాచ్‌ను వీలైనంత చివరి వరకు తీసుకెళ్లాలనుకున్నా. అందరూ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది.

నమన్ ధీర్‌కు క్రెడిట్ ఇవ్వాలి..

ఐదు వికెట్ల తర్వాత క్రీజులోకి వచ్చిన నమన్‌ధీర్‌తో ఒక్కటే చెప్పా. ఏది ఏమైనా మనం చివరి వరకు ఆడాలిని అన్నా. ఈ రోజు పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది. అందుకే స్పిన్నర్ల బౌలింగ్‌లో క్విక్ సింగిల్స్, డబుల్స్ తీయాలని అనుకున్నాం. వాళ్ల బౌలింగ్‌లో వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించాం.

దురదృష్టవశాత్తు మిచెల్ సాంట్నర్ ఆఖరి ఓవర్‌లో నమన్ ధీర్ ఔటయ్యాడు. లేకపోతే మ్యాచ్‌ను 18వ ఓవర్‌లోనే ముగించేవాళ్లం. ఈ విజయంలో నమన్‌కు కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతను అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత హైదరాబారీ కుర్రాళ్లమైన నేను, నితీష్ రెడ్డితో కలిసి మ్యాచ్‌ను ముగించడం చాలా సంతోషంగా ఉంది.

IND vs NZ: ఆ తప్పిదాలతో పాటు ఆ ముగ్గురు మా కొంపముంచారు: మిచెల్ సాంట్నర్

Also Read

IND vs NZ: ఆ తప్పిదాలతో పాటు ఆ ముగ్గురు మా కొంపముంచారు: మిచెల్ సాంట్నర్

స్పిన్నర్లను తెలివిగా ఆడాం..

స్పిన్నర్లు చాలా తెలివిగా ఆడాలనుకున్నాం. మా రేంజ్‌లోకి బంతి వస్తేనే హిట్టింగ్ చేయాలని, లేదంటే గ్యాప్ షాట్స్ ఆడి వేగంగా పరుగులు తీయాలనుకున్నాం. స్పిన్ బౌలింగ్‌లో మేం 4-5 డబుల్స్ తీసాం. ఈ 8-10 పరుగులు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. స్పిన్నర్లపై తెలివిగా ఆడి.. పేసర్లను టార్గెట్‌ చేసి సిక్సర్లు కొట్టాలనుకున్నాం. ఇంత పెద్ద మైదానంలో సిక్సర్లు కొట్టాలంటే బంతికి ఆ వేగం అవసరం. అవకాశం కోసం ఎదురు చూసి తమదైన శైలిలో మ్యాచ్ ముగించాం.'అని తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు.

Story first published: Saturday, October 24, 2026, 17:41 [IST]
Other articles published on Oct 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+