IND vs WI: ఈ రోడ్డు పిచ్‌లతో ఏం ఫాయిదా.. భారత్ విజయంపై గంభీర్ అసహనం!
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే తీరుపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌లతో ఏం ఫాయిదా? అని ప్రశ్నించాడు. భారత విజయంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్నా.. గంభీర్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఏ మాత్రం క్రికెట్ కాదని, కేవలం బ్యాటింగ్ మాత్రమేనని సెటైర్లు పేల్చాడు.
బుధవారం గౌహతి వేదికగా జరిగిన రెండో వన్డే భారత్ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై ఏకంగా ఐదుగురు బ్యాటర్లు శతకాలు సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గంభీర్.. పిచ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

పాపం బౌలర్లు..
'ఈ మ్యాచ్ ఫలితం చూశాక. బ్యాట్‌కు బంతికి మధ్య పోటీ ఉండాలనిపిస్తోంది. ఇది ఏ మాత్రం క్రికెట్ కాదు. కేవలం బ్యాటింగ్ మాత్రమే. ప్రత్యర్థి జట్టు 400+ పరుగులు చేయడం .. ఆ తర్వాత భారత్ ఆ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం.. రికార్డుల పరంగా.. ప్రేక్షకులకు, బ్రాడ్ కాస్టర్లకు కనువిందుగా అనిపించవచ్చు. కానీ ఒక నిజమైన క్రికెట్ అభిమానిగా.. కోచ్‌గా నేను మాత్రం అసంతృప్తిగానే ఉన్నా. బౌలర్లకు కూడా అవకాశం ఉండాలి. ఇలాంటి వికెట్‌పై ఓ కుర్రాడు బౌలింగ్ చేస్తే.. అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి.
కేవలం బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లను తయారు చేయడం కాదు. బౌలర్లను కూడా కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఈ తరహా బ్యాటింగ్ పిచ్‌లపై బౌలర్లు గణంకాల గురించి ఆందోళన చెందనక్కర్లేదు. అరంగేట్ర పేసర్ అకిబ్ నబీతో పాటు ఇతర బౌలర్లకు ఈ మ్యాచ్ కలిసి రాలేదు. వచ్చే మ్యాచ్‌లోనూ అకిబ్‌ను ఆడిస్తాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సిరీస్‌ల్లో ఎదురయ్యే గెలుపు, ఓటములను మేం పట్టించుకోవడం లేదు.
ఐపీఎల్ తర్వాత ప్రధాన ఆటగాళ్ల ఎంపిక..
ప్రపంచకప్‌లోనే బాగా ఒత్తిడి ఉంటుందని మాకు తెలుసు. నాలుగేళ్లకు ఒకసారి మెగా టోర్నీ జరుగుతుంది కాబట్టే అంత టెన్షన్ ఉంటుంది. అంతే తప్పా క్రికెట్‌లో మరేది మారదు. గుర్నూర్ బ్రార్ పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీకి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. అందులో మూడు నెలలు ఐపీఎల్ జరుగుతుంది. మరో మూడు నెలలు భారత్, ఆస్ట్రేలియా సిరీస్ జరుగుతుంది.
మహా అయితే మరో 20 వన్డేలు మాత్రమే ప్రపంచకప్ ముందు ఆడుతాం. అందులోనే ఆటగాళ్లను పరీక్షించాలి. ఐపీఎల్ తర్వాతే మా ప్రధాన ఆటగాళ్లతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తాం. అప్పటి వరకూ భిన్నమైన కాంబినేషన్లను ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రస్తుతం అకిబ్‌కు అవకాశం వచ్చింది. తర్వాత మరో బౌలర్ ఆడవచ్చు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


