Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

15 ఏళ్లయినా.. 30 ఏళ్లయినా వెయిట్ చేయాల్సిందే: గౌతమ్ గంభీర్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. వైభవ్ సూర్యవంశీ కోసం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టలేనని తెలిపాడు. 15 ఏళ్లయినా.. 30 ఏళ్ల ఆటగాడైనా అవకాశం కోసం వేచి చూడాల్సిందేనన్నాడు.

అఫ్గానిస్థాన్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదు. దాంతో వైభవ్‌ను ఎందుకు ఆడించలేదనే ప్రశ్నలు వచ్చాయి. జింబాబ్వే పర్యటనలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన వైభవ్‌ను ఆడించకపోవడం ఏంటని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు నిలదీసారు.

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

అత్యంత కఠిన నిర్ణయం..

గురువారం మూడో టీ20 విజయానంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్.. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అలాగే ఇంగ్లండ్ పర్యటనలో సంజూ శాంసన్‌కు బదులు వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించడం తన కోచింగ్ కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన నిర్ణయమని చెప్పుకొచ్చాడు.

Gautam Gambhir Says Vaibhav Sooryavanshi Will Have to Wait After Missing Afghanistan T20Is

'సంజూ శాంసన్ సత్తా ఏంటో అందరికి తెలిసిందే. ప్రతిభ లేకుండా ఎవరూ ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవలేరు. అతను జట్టుకు కావాల్సింది చేశాడు. అందుకే అతన్ని పక్కనపెట్టడమనేది నా కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయం. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడించలేకపోయా. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

15 ఏళ్లయినా.. 30 ఏళ్లయినా వెయిట్ చేయాల్సిందే..

నా దృష్టిలో ప్రపంచకప్ కాంబినేషన్‌నే కొనసాగిస్తే మంచిదనిపించింది. ఏదో మూడు, నాలుగు సార్లు విఫలమైనంత మాత్రాన వారు చెత్త ఆటగాళ్లుగా మారిపోరు. ప్రపంచకప్ నుంచి మరో ప్రపంచకప్ వరకు అజేయంగా నిలిచి, టైటిల్ గెలిచిన జట్టు అది. కేవలం ఒక సిరీస్ ఫలితం ఆధారంగా జట్టును తక్కువ అంచనా వేయలేం. వైభవ్ సూర్యవంశీ విషయంలో మేం స్పష్టతతోనే ఉన్నాం. అతను అవకాశం కోసం వేచి చూడాలి.

IND vs WI: వన్డేల్లోకి ఆ ముంబై ఆటగాడా? ఏం చూసి ఎంపిక చేశారు?: హనుమ విహారి

Also Read

IND vs WI: వన్డేల్లోకి ఆ ముంబై ఆటగాడా? ఏం చూసి ఎంపిక చేశారు?: హనుమ విహారి

అతని టాలెంట్ ఏంటో మాకు తెలుసు. అయితే.. జట్టులో కొత్తగా చేరిన వారి కంటే.. గత కొన్నేళ్లుగా జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్న వారికే మేం ప్రాధాన్యత ఇస్తాం. అవకాశం కల్పించిన ఆటగాళ్లకు జట్టులో కొనసాగేందుకు తగినంత సమయం కూడా ఇవ్వాలి. భారత క్రికెట్‌లో పోటీతత్వం ఉండాలి. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రతిభావంతులు ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటాం. 15 ఏళ్ల కుర్రాడైనా.. 30 ఏళ్ల ఆటగాడైనా అవకాశం కోసం వేచి చూడాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, September 19, 2026, 18:28 [IST]
Other articles published on Sep 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+