Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది నా కోచింగ్ కెరీర్‌లోనే కఠిన నిర్ణయం.. ఆ రాత్రి నిద్ర కూడా పట్టలేదు: గంభీర్

ఇంగ్లండ్ పర్యటనలో సంజూ శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్‌లోనే అత్యంత కఠిన నిర్ణయమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. సంజూ శాంసన్‌ను తప్పించినందుకు ఆ రోజు రాత్రి తనకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో అద్వితీయమైన ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ .. ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా విఫలమవడంతో అతన్ని పక్కనపెట్టి టీనేజ్ సెన్సేషన్ వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. జింబాబ్వే పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. అతని గైర్హాజరీలో వైభవ్ అద్భుతంగా రాణించాడు. కానీ సంజూ జట్టులోకి తిరిగి రావడంతో వైభవ్ బెంచ్‌‌కే పరిమితమయ్యాడు.

15 ఏళ్లయినా.. 30 ఏళ్లయినా వెయిట్ చేయాల్సిందే: గౌతమ్ గంభీర్

15 ఏళ్లయినా.. 30 ఏళ్లయినా వెయిట్ చేయాల్సిందే: గౌతమ్ గంభీర్

ఆ రోజు నిద్ర కూడా పట్టలేదు..

అద్భుతంగా ఆడుతున్న వైభవ్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు రాగా.. వాటికి గంభీర్ సమాధానమిచ్చాడు. సంజూ శాంసన్ ఉన్నంత వరకు వైభవ్ వేచి చూడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ఇదే విషయంపై తాజాగా జియో హాట్‌స్టార్ షోలో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నా రెండేళ్ల కోచింగ్ కెరీర్‌లో ఆ ఒక్క రాత్రే నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఈ విషయాన్ని నేను సంజూతో కూడా చెప్పాను.

Gautam Gambhir Reveals Sleepless Night Over One India Selection Call Involving Vaibhav Sooryavanshi

ఎందుకంటే అతన్ని తప్పించడం నా కోచింగ్ కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రపంచకప్ హీరో అయిన ఆటగాడిని కేవలం మూడు, నాలుగు మ్యాచ్‌ల తర్వాత పక్కనపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సిరీస్ గెలవాలంటే మాకు టాపార్డర్‌లో పరుగులు అవసరమయ్యాయి. సంజూతో నేను చాలా నిజాయితీగా మాట్లాడాను. అతను కూడా దాన్ని సానుకూలంగా స్వీకరించాడు.

బయటి విమర్శలు తుది జట్టును నిర్ణయించలేవు..

సోషల్ మీడియా లేదా బయటి విమర్శలు తుది జట్టును నిర్ణయించవు. డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్, కోచ్ కలిసి.. ఎవరైతే మ్యాచ్ గెలిపిస్తారని భావిస్తామో వారికే అవకాశం కల్పిస్తాం. రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను కొన్ని వైఫల్యాలకే పక్కనపెట్టి, డ్రెస్సింగ్ రూమ్‌లో అభద్రతాభావాన్ని తీసుకురాలేం. ప్రజాదరణ పొందే నిర్ణయాలు తీసుకోవడం సులవు. కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడమే కష్టం. మేం సరైన నిర్ణయమే తీసుకున్నాం.'అని వైభవ్‌ను పక్కనపెట్టడాన్ని గంభీర్ సమర్థించుకున్నాడు.

క్రికెట్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్‌కు బీసీసీఐ ప్లాన్!

Also Read

క్రికెట్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్‌కు బీసీసీఐ ప్లాన్!

ఈ సందర్భంగా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌ను గంభీర్ ప్రత్యేకంగా కొనియాడాడు. 'కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌లో నాకు నచ్చిన ప్రధాన లక్షణం అతని నిస్వార్థం. జట్టు ప్రయోజనాల కోసం తన నాలుగో బ్యాటింగ్ స్థానాన్ని కూడా వదులుకోవడానికి రెడీ అయ్యేవాడు. ఒక కెప్టెన్ ఇలా చేయడం చాలా అరుదు. ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన తొలి లక్షణం ఇదే. శ్రేయస్‌లో నిస్వార్థం పుష్కలంగా ఉంది.' అని ప్రశంసించాడు. ఒకటి రెండు పరాజయాలతో జట్టును అంచనా వేయడం సరికాదని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, September 23, 2026, 17:56 [IST]
Other articles published on Sep 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+