Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కజిన్ సిస్టర్స్‌ను పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్లు!

పలువురు పాకిస్థాన్ క్రికెటర్లు తమ కజిన్స్ లేదా సోదరి వరుసయ్యే వారిని పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో పాటు సయీద్ అన్వర్, మహిళా క్రికెటర్ బిస్మా మరూఫ్‌లు ఉన్నారు. పాకిస్థాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సైతం తమ కజిన్‌తో నిశ్చితార్థం జరుపుకున్నాడు. పలువురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా తమ కజిన్స్‌ను పెళ్లి చేసుకున్నారు.

IND vs NZ: ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే భారత్ గెలిచేది!(వీడియో)

IND vs NZ: ఆ ఒక్క క్యాచ్ పట్టి ఉంటే భారత్ గెలిచేది!(వీడియో)

1. షాహిద్ అఫ్రిది

పాకిస్థాన్ దిగ్గజ ఆల్‌రౌండర్ అయిన షాహిద్ అఫ్రిది తన మేనమామ కూతురైన నదియాను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదుగురు అమ్మాయిలు జన్మించారు. ఇందులో ఒక అమ్మాయిని షాహిన్ షా అఫ్రిదికి ఇచ్చి వివాహం చేశారు. షాహిద్ అఫ్రిది పాకిస్థాన్ జట్టుకు సారథ్యం కూడా వహించడంతో పాటు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు.

These 3 Pakistani Cricketers Married Their Cousins Here s What You Should Know

2. సయీద్ అన్వర్

పాకిస్థాన్ మాజీ ఓపెనర్ అయిన సయీద్ అన్వర్ 1996లో తన కజిన్ సిస్టర్ అయిన లుబ్నాని వివాహం చేసుకున్నాడు. లుబ్నా దూరపు బంధువే అయినప్పటికీ అతనికి వరుసకు సోదరి అవుతుంది. లుబ్నా వృతి రీత్యా డాక్టర్. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు బిస్మా అన్వర్ అనారోగ్య సమస్యలతో 2001లో మరణించింది. కూతురి మరణం సయీద్ అన్వర్‌ను ఎంతో కలిచి వేసింది. ఆ తర్వాత 2003లో ఖజిమా సయీద్ అనే కుమారుడు జన్మించాడు.

పాకిస్థాన్ ఓపెనర్‌గా ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన సయీద్ అన్వర్ 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 1989 నుంచి 2003 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సయీద్ అన్వర్.. బ్యాటింగ్‌తో పాటు లెఫ్టార్మ్ బౌలింగ్ చేసేవాడు. పాకిస్థాన్‌కు సారథ్యం కూడా వహించాడు.

IND vs NZ: భారత వన్డే జట్టులోకి జమ్మూ సెన్సేషన్!

Also Read

IND vs NZ: భారత వన్డే జట్టులోకి జమ్మూ సెన్సేషన్!

3. బిస్మా మరూఫ్

పాకిస్థాన్ మాజీ మహిళా క్రికెటర్ బిస్మా మరూఫ్ కూడా తన కజిన్‌ అబ్రార్ అహ్మద్‌ను 2018లో వివాహం చేసుకుంది. బిస్మా మరూఫ్‌కు అబ్రార్ అహ్మద్ వరుసకు బావ అవుతాడు. అబ్రార్ అహ్మద్ వృత్తి రీత్యా ఇంజనీర్. బిస్మా మరూఫ్ పాకిస్థాన్ తరఫున 136 వన్డేలతో పాటు 140 టీ20లు ఆడింది.

4. బాబర్ ఆజామ్..

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తన దగ్గరి బంధువైన కజిన్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. గతేడాదిగా ఈ వార్త ప్రచారంలో ఉన్నా బాబర్ ఆజామ్ స్పందించలేదు. ఇటీవలే పాకిస్థాన్ జట్టులోకి పునరాగమనం చేసిన బాబర్ ఆజామ్ తిరిగి సారథ్య బాధ్యతలను కూడా అందుకున్నాడు. బంగ్లాదేశ్ క్రికెటర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మొసాదెక్ హుస్సేన్‌లు కూడా కజిన్ సిస్టర్స్‌ను పెళ్లి చేసుకున్నారు.

Story first published: Saturday, October 31, 2026, 10:53 [IST]
Other articles published on Oct 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+