IND vs NZ: భారత వన్డే జట్టులోకి జమ్మూ సెన్సేషన్!
న్యూజిలాండ్ పర్యటనలోని ఐదు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. చివరి రెండు వన్డేల్లో మాత్రమే భాగంగా ఉన్న జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీని తొలి మూడు వన్డేలకు కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రసిధ్ కృష్ణ తొడ కండరాల గాయం నుంచి కోలుకోకపోవడంతో అతని స్థానంలో అవకాశం కల్పించారు.
బుధవారం(నవంబర్ 4) నుంచి ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తొలి మూడు వన్డేల్లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని రెగ్యులర్ వన్డే టీమ్ ఆడనుండగా..చివరి రెండు వన్డేలకు టెస్ట్ ప్లేయర్లు దూరంగా ఉండనున్నారు. రెండు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్నాడు.
ప్రసిధ్ కృష్ణ తప్పుకోవడంతో..
వాస్తవానికి తొలి మూడు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో ప్రసిధ్ కృష్ణకు అవకాశం కల్పించారు. టెస్ట్ టీమ్‌లో ఉన్న అతన్ని చివరి రెండు వన్డేల నుంచి తప్పించి ఆకిబ్ నబీకి అవకాశం కల్పించారు. కానీ ప్రసిధ్ కృష్ణ గాయం నుంచి కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ మొత్తానికి ఆకిబ్ నబీని తీసుకున్నారు. ప్రసిధ్ కృష్ణ ఫిట్‌నెస్ సాధిస్తే నేరుగా టెస్ట్ సన్నాహకాల్లో పాల్గొననున్నాడు. నితీష్ రెడ్డి కేవలం తొలి వన్డే మాత్రమే ఆడనున్నాడు. ఆ తర్వాత అతను భారత్-ఏ తరఫున అనధికారిక టెస్ట్ సిరీస్ ఆడనున్నాడు. ఆకిబ్ నబీని తొలి మూడు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో చేర్చిన విషయాన్ని బీసీసీఐ శనివారం అధికారికంగా ప్రకటించింది.

మరోవైపు న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. ఇప్పటికే ఐదు టీ20ల సిరీస్‌ను 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆఖరి టీ20 ఆదివారం జరగనుండగా.. ఐదు వన్డేల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. వన్డే టీమ్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ న్యూజిలాండ్ చేరి సన్నాహకాలు ప్రారంభించారు.
తొలి మూడు వన్డేలకు భారత్ జట్టు:
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి(తొలి వన్డేకు మాత్రమే), ఆకిబ్ నబీ
చివరి రెండు వన్డేలకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్ర, మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


