Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తెలంగాణ కుర్రాడి విధ్వంసం.. 47 బంతుల్లోనే శతకం!

తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్(టీజీ20) టోర్నీలో మరో శతకం నమోదైంది. అనురాగ్ నల్గొండ నైట్స్ ఓపెనర్, హైదరాబాద్ కుర్రాడు గౌరవ్ రెడ్డి(47 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 101 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. టీ20ల్లో గౌరవ్ రెడ్డికి ఇదే తొలి సెంచరీ. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా మెదక్ ఫాల్కన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గౌరవ్ రెడ్డి ఈ ఫీట్ సాధించాడు. అతని సెంచరీ ధాటికి అనురాగ్ నల్గొండ నైట్స్ 8 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్‌ను ఓడించింది.

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

IND Vs ENG: వైభవ్ కోసం సంజూ‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. విక్రమ్ నాయక్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 నాటౌట్), వరుణ్ ఎర్రమ్(29 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 44 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రుంజిత్ రెడ్డి(30), రవి తేజ(33) దూకుడుగా ఆడారు. నల్గొండ బౌలర్లలో రక్షణ్ రెడ్డి, అనికేత్ రెడ్డి, ఇయాన్ సతని తలో వికెట్ తీసారు.

TG20 League Gaurav Reddy Blasters Smashes 47-Ball Century as Nalgonda Knights Crush

అనంతరం అనురాగ్ నల్గొండ నైట్స్ 16.3 ఓవర్లలో 2 వికెట్లకు 181 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గౌరవ్ రెడ్డి‌తో పాటు జశ్వత్ మోతే(34), కెప్టెన్ రాహుల్ బుద్ది(20 నాటౌట్) రాణించారు. మెదక్ ఫాల్కన్స్ బౌలర్లలో మధుకర్ మన్నె, అర్జున్ గొర్రపల్లి తలో వికెట్ తీసారు.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన అనురాగ్ నల్గొండ నైట్స్ 4 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు మెదక్ ఫాల్కన్స్ వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. తిలక్ వర్మ సారథ్యంలో తొలి మ్యాచ్‌లో గెలిచిన మెదక్ ఫాల్కన్స్.. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.

TG T20 League: రూ.50కే ఉప్పల్ మ్యాచ్ టికెట్స్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ!

TG T20 League: రూ.50కే ఉప్పల్ మ్యాచ్ టికెట్స్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ!

తిలక్ శతకంతో ఆ జట్టుకు అద్బుతమైన ఆరంభం అందించినా.. అతని గైర్హాజరీలో మెదక్ బలహీనంగా మారిపోయింది. 5 మ్యాచ్‌లకు 5 గెలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 10 పాయింట్స్‌తో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఐదు మ్యాచ్‌ల్లో మూడేసి విజయాలు సాధించిన కరీం నగర్, రంగారెడ్డి, ఖమ్మం వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించనుండగా.. జులై 12న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడనుంది.

Story first published: Friday, July 3, 2026, 18:42 [IST]
Other articles published on Jul 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+