Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

TG T20 League: రూ.50కే ఉప్పల్ మ్యాచ్ టికెట్స్.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ!

తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 లీగ్‌ 2026 తొలి సీజన్‌కు రంగం సిద్దమైంది. జూన్ 21 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీకి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను శ్రీనిధి యూనివర్సిటీ దక్కించుకుంది. లీగ్ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో అభిమానులను ఆకర్షించడానికి హెచ్‌సీఏ, ఫ్రాంచైజీలు క్యాంపైన్‌ను నిర్వహిస్తున్నాయి.

బుధవారం ట్యాంక్‌బండ్‌పై ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల నెక్లస్ రోడ్‌లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ డిస్‌ప్లే షోలో 8 జట్ల లోగోలను నిర్వాహకులు ప్రదర్శించారు.

TG T20 League 2026 Vijay Deverakonda Named Brand Ambassador as Match Tickets Launch at Just Rs 50

కోటీ ప్రైజ్‌మనీ..

ఈ టోర్నీలో 8 జట్లు ఇతర టీమ్స్‌తో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. లీగ్ దశ ముగిసే సరికి టాప్-4లో నిలిచిన టీమ్స్ ప్లే ఆఫ్స్ ఆడుతాయి. జులై 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాలమూరు స్ట్రైకర్, అన్విత ఖమ్మం ఏసెస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మంగళవారం బేగంపేట్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు, హెచ్‌సీఏ, ఫ్రాంచైజీల యాజమానులు హాజరయ్యారు.

టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు లీగ్ వివరాలను వెల్లడించారు. విజేత జట్టుకు రూ. కోటి నగదు బహుమతి, రన్నరప్‌గా నిలిచిన టీమ్‌కు రూ.50 లక్షలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ అందజేస్తామని చెప్పారు.

రూ.50కే టికెట్లు..

ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌కు ముందు వేడుకలు ఉంటాయని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ కాన్సర్ట్, లేజర్ షో ఉంటుందని చెప్పారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మినహా.. ఐపీఎల్ రూల్స్ అన్నీ ఈ లీగ్‌లో ఉంటాయని స్పష్టం చేశారు. డిస్ట్రిక్ యాప్‌లో మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులో ఉన్నాయని, ఒక్కో టికెట్ ధర రూ.50 నుంచి 100గా నిర్ణయించామని చెప్పారు.

అమ్మో వైభవ్.. జైస్వాల్ వెంటనే రాజస్థాన్‌ను వీడాలి: అంబటి రాయుడు

అమ్మో వైభవ్.. జైస్వాల్ వెంటనే రాజస్థాన్‌ను వీడాలి: అంబటి రాయుడు

ఎలా చూడాలంటే..?

ఈ మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.


TG20 లీగ్ - 8 ఫ్రాంచైజీ జట్లు

వరంగల్ వారియర్స్ -(ఐకాన్ ప్లేయర్: మహ్మద్ సిరాజ్)

మెదక్ ఫాల్కన్స్ (ఐకాన్ ప్లేయర్: తిలక్ వర్మ)

ప్రాణవ రంగారెడ్డి రైజర్స్

అనురాగ్ నల్గొండ నైట్స్

కరీంనగర్ డైమండ్స్

పాలమూరు స్ట్రైకర్స్

అన్విత ఖమ్మం ఏసెస్

హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్

టీజీ టీ20 లీగ్ షెడ్యూల్..

జూన్ 21: పాలమూరు స్ట్రైకర్స్ vs అన్విత ఖమ్మం ఏసెస్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 22: రంగారెడ్డి రైజర్స్ vs నల్గొండ నైట్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 22: వరంగల్ వారియర్స్ vs మెదక్ ఫాల్కన్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 23: పాలమూరు స్ట్రైకర్స్ vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 23: రంగారెడ్డి రైజర్స్ vs మెదక్ ఫాల్కన్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 24: అన్విత ఖమ్మం ఏసెస్ vs వరంగల్ వారియర్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 24: నల్గొండ నైట్స్ vs కరీంనగర్ డైమండ్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 25: రంగారెడ్డి రైజర్స్ vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 25: పాలమూరు స్ట్రైకర్స్ vs మెదక్ ఫాల్కన్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 26: నల్గొండ నైట్స్ vs వరంగల్ వారియర్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 26: అన్విత ఖమ్మం ఏసెస్ vs కరీంనగర్ డైమండ్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 27: మెదక్ ఫాల్కన్స్ vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 27: పాలమూరు స్ట్రైకర్స్ vs రంగారెడ్డి రైజర్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 28: వరంగల్ వారియర్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 29: పాలమూరు స్ట్రైకర్స్ vs నల్గొండ నైట్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూన్ 29: అన్విత ఖమ్మం ఏసెస్ vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూన్ 30: మెదక్ ఫాల్కన్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూలై 1: వరంగల్ వారియర్స్ vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూలై 1: అన్విత ఖమ్మం ఏసెస్ vs నల్గొండ నైట్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూలై 2: రంగారెడ్డి రైజర్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూలై 3: నల్గొండ నైట్స్ vs మెదక్ ఫాల్కన్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూలై 3: పాలమూరు స్ట్రైకర్స్ vs వరంగల్ వారియర్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూలై 4: అన్విత ఖమ్మం ఏసెస్ vs రంగారెడ్డి రైజర్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూలై 4: కరీంనగర్ డైమండ్స్ vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూలై 5: బ్రేక్ డే (మ్యాచ్‌లు లేవు)

జూలై 6: మెదక్ ఫాల్కన్స్ vs అన్విత ఖమ్మం ఏసెస్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూలై 6: నల్గొండ నైట్స్ vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ (రాత్రి 7.15 గంటలకు)

జూలై 7: పాలమూరు స్ట్రైకర్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2.15 గంటలకు)

జూలై 7: రంగారెడ్డి రైజర్స్ vs వరంగల్ వారియర్స్ (రాత్రి 7.15 గంటలకు)

IPL 2026: తెలుగు కామెంటేటర్స్ డిష్యూం డిష్యూం!(వీడియో)

IPL 2026: తెలుగు కామెంటేటర్స్ డిష్యూం డిష్యూం!(వీడియో)
Story first published: Tuesday, June 16, 2026, 19:27 [IST]
Other articles published on Jun 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+