IND Vs ENG: వైభవ్ కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు: సబా కరీం
టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మాజీ క్రికెటర్ సబా కరీం అండగా నిలిచాడు. ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల ఆధారంగా సంజూ శాంసన్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు 15 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి సిద్దంగా ఉండటంతో సంజూపై విమర్శలు ఎక్కువయ్యాయి. అతన్ని పక్కనపెట్టి వైభవ్‌ను ఆడించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
సంజూపై విమర్శలు సరికాదు..
ఈ క్రమంలోనే సంజూ శాంసన్‌కు మద్దతుగా సబా కరీం మాట్లాడాడు. 'సంజూ శాంసన్ గొప్ప ఆటగాడు. అతను ఇప్పటికే చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా ఆడాడు. టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2026 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయినా ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమవ్వగానే అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని సంజూ అనుకుంటున్నాడు.

టీ20 క్రికెట్‌లో విఫలమవ్వడం సహజం. ఓపెనర్, టాపార్డర్‌లో ఆడేవారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో సంజూ శాంసన్‌కు అపారమైన అనుభవం ఉంది. అతనికి వరుస అవకాశాలు ఇవ్వడం వల్ల జట్టు స్థిరత్వానికి ఉపయోగపడుతుంది.
వైభవ్ నేర్చుకునే దశలోనే ఉన్నాడు..
వైభవ్ సూర్యవంశీ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. భారత జట్టులో చోటు దక్కడం అతనికి గొప్ప అనుభవం. కానీ తుది జట్టులో చోటు దక్కాలంటే మరింత కష్టపడాలనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఇలాంటి సవాల్‌తో కూడిన వాతావరణం అతన్ని ఒక ఆటగాడిగా.. వ్యక్తిగా ఎదగడానికి సహాయపడుతుంది. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. ఇలాంటి వాతావరణంలో ఓపికగా వేచి ఉండాల్సి ఉంటుంది.’అని సబా కరీం చెప్పుకొచ్చాడు.
భారత మాజీ టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత జట్టులో చోటు దక్కడమే వైభవ్‌కు గొప్ప అవకాశం అని అభిప్రాయపడ్డాడు. సీనియర్ ఆటగాళ్లు, కోచ్‌లతో కలిసి ప్రాక్టీస్ చేయడం ద్వారా అతను మైదానంలోనే కాకుండా.. మానసికంగా కూడా మెరుగవుతాడని పుజారా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌లోని భిన్నమైన పిచ్‌లపై ప్రాక్టీస్ చేయడం ద్వారా వైభవ్ మరింత రాటు దేలుతాడని పుజారా చెప్పుకొచ్చాడు.
టీమ్ మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌కు అండగా నిలుస్తుంది. దాంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కడం లేదు. మరోవైపు రవి శాస్త్రి, గవాస్కర్, ఏబీ డివిలియర్స్ వంటి మాజీ ఆటగాళ్లు వైభవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

