Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిక్స్‌డ్ క్రికెట్ టోర్నీ.. ఒకే జట్టులో అబ్బాయిలు, అమ్మాయిలు! ఎక్కడంటే..?

క్రికెట్‌లోనూ మిక్స్‌డ్ జెండర్ మ్యాచ్‌లు రాబోతున్నాయి. టెన్నిస్, బ్యాడ్మింటన్, ఆర్చరీ లాంటి క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్, మిక్స్‌డ్ టీమ్ అనే పదాలు ఎక్కువగా వింటాం. పురుషు, మహిళా అథ్లెట్లు కలిసి ఒక జట్టుగా బరిలోకి దిగితే మిక్స్‌డ్ టీమ్ అంటారు. ఇప్పుడు క్రికెట్‌లోనూ ఈ తరహా మ్యాచ్‌లు అభిమానులను అలరించబోతున్నాయి.

వినూత్న ఫార్మాట్‌లో జరగనున్న ఈ మిక్స్‌డ్ క్రికెట్ మ్యాచ్‌లకు శ్రీలంక రాజధాని కొలంబో ఆతిథ్యం ఇవ్వబోతుంది. సింహలెస్ స్పోర్ట్స్ క్లబ్ టెస్ట్ ట్వంటీ ఫార్మాట్‌తో ఈ మిక్స్‌డ్ క్రికెట్‌ మ్యాచ్‌లను ప్రపంచానికి పరిచయం చేబుతోంది. నవంబర్ 14 నుంచి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది.

క్రికెట్‌లో వింత రనౌట్.. కీపర్ కాలు కింద బ్యాట్.. అంపైర్ నిర్ణయంపై రచ్చ! (వీడియో)

క్రికెట్‌లో వింత రనౌట్.. కీపర్ కాలు కింద బ్యాట్.. అంపైర్ నిర్ణయంపై రచ్చ! (వీడియో)

ఈ టోర్నీ కోసం ప్రపంచంలోని నాలుగు ఖండాల నుంచి 13 నుంచి 21 ఏళ్ల వయసు కలిగిన సుమారు 160 మంది పురుష, మహిళా క్రికెటర్లను ఎంపిక చేశారు. ఈ 160 మందిని నాలుగు జట్లుగా విడగొట్టారు. ఒక జట్టులో 20 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఉంటారు. ఒకే రోజులో 80 ఓవర్ల మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఒక్కో టీమ్ 40 ఓవర్ల చొప్పున రెండు సార్లు బ్యాటింగ్ చేస్తోంది. తొలి 20-20 మ్యాచ్‌ను రెడ్ బాల్‌తో వైట్ జెర్సీలో పగటి పూట ఆడాల్సి ఉంటుంది. రెండో 20-20 మ్యాచ్‌ వైట్‌బాల్ కలర్ జెర్సీలో ఫ్లడ్ లైట్స్ కింద ఆడాలి.

Test Twenty Format New Mixed-Gender Cricket Format to Debut in Colombo on November 14

ఈ మ్యాచ్‌కు టాస్ అత్యంత కీలకం కానుంది. టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఎంచుకోవడంతో పాటు.. తొలుత బాలికలు ఆడుతారా? బాలురు ఆడుతారా? అనేది నిర్ణయించుకోవచ్చు. బాలబాలికలకు సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ టోర్నీని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. బాల, బాలికల రెండు టీమ్స్ కలిసి ఆడితే విజయం దక్కుతుంది.

IND vs WI ఆఖరి టీ20కి భువనేశ్వర్ కుమార్.. గాయంతో అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

Also Read

IND vs WI ఆఖరి టీ20కి భువనేశ్వర్ కుమార్.. గాయంతో అర్ష్‌దీప్ సింగ్ ఔట్!

వీరందరూ చేసిన పరుగులను కలిపి తుది ఫలితాన్ని తేల్చుతారు. ఈ టోర్నీ సలహాదారుల బోర్డులో ఏబీ డివిలియర్స్, మాథ్యూ హేడెన్, సర్ క్లైవ్ లాయిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. గ్లోబల్ సెలెక్షన్ కమిటీ అధ్యక్షుడిగా విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ, టోర్నీ కార్యకలపాలకు మైక్ ఫోర్డమ్ సారథ్యం వహిస్తారు. ఇది ప్యారిటీ స్పోర్ట్స్అనే ప్రైవేట్ సంస్థ ప్రవేశపెట్టిన ఒక కొత్త తరహా మిక్స్డ్-జెండర్ ప్రయోగాత్మక ఫార్మాట్. ఈ టోర్నీకి ఐసీసీ ఆమోదం లేదు. పూర్తిగా ప్రైవేట్ టోర్నీ.

Story first published: Friday, October 16, 2026, 19:28 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+