Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగు క్రికెటర్!

భారత మహిళా క్రికెటర్, తెలుగు తేజం సబ్బినేని మేఘన ఆటకు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆటకు దూరమైనా క్రికెట్‌తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

'భారత్ జెర్సీ‌లో బ్యాట్‌ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టిన ఆ క్షణం నా కల సాకారమైనట్లనిపించింది. ఇప్పుడు ప్లేయర్‌గా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్న తరుణంలో నా మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. క్రికెట్ గ్రౌండే నాకు రెండో ఇల్లు. ఒడిదుడుకులను తట్టుకోవడంతో పాటు ఒదిగి ఉండటం ఇక్కడే నేర్చుకున్నాను. జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకాలను మూటగట్టుకున్నాను. ఈ ఆటకు నాకు మంచి స్నేహితులను కూడా ఇచ్చింది.

IND vs NZ: గాయంతో ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్! న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs NZ: గాయంతో ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్! న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

నా కష్ట సుఖాల్లో అండగా నిలిచిన నా కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను నిరంతరం పోత్రహించిన నా కోచ్‌లకు, డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న సహచరులకు, సపోర్ట్ స్టాఫ్‌కు ధన్యవాదాలు. ఇక నాకు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అభిమానుల ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపించింది.

Telugu Cricketer Sabbhineni Meghana Announces Retirement from All Forms of Cricket

నా కెరీర్ ఆసాంతం అండగా నిలిచిన బీసీసీఐ, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, ఆర్‌ఎస్‌పీబీ సంస్థలకు స్పెషల్ థ్యాంక్స్. నా క్రికెట్ పిచ్చిని అత్యున్నత స్థాయిలో కొనసాగించడానికి సరైన వేదికను, అవకాశాలను ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటాను.

ప్లేయర్‌గా నా ప్రయాణం ముగిసినా.. క్రికెట్‌తో నా బంధం తెగిపోదు. ఈ ఆటతో నా అనుబంధం ఎప్పటికీ ఇలా కొనసాగుతోంది. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ ఆటకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. నా జీవితాన్ని క్రికెట్‌కే అంకితం చేస్తూ.. అప్‌కమింగ్ జనరేషన్‌కు గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. క్రికెట్ అంటే నాకు పిచ్చి. అది ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది. 'అని సబ్బినేని మేఘన భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకుంది.

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

Also Read

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల సబ్బినేని మేఘన భారత జట్టు తరఫున 3 వన్డేలు, 17 టీ20లు ఆడింది. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన మేఘన వన్డేల్లో 114, టీ20ల్లో 258 పరుగులు చేసింది. 2016లో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మేఘన.. భారత్ తరఫున చివరగా 2022లో ఆడింది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించింది. స్మృతి మంధాన సారథ్యంలోని డబ్ల్యూపీఎల్ 2024 టైటిల్ గెలిచిన ఆర్‌సీబీ టీమ్‌లో మేఘన సభ్యురాలిగా ఉంది.

Story first published: Friday, October 23, 2026, 14:51 [IST]
Other articles published on Oct 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+