IND vs NZ: గాయంతో ఇషాన్ ఔట్.. వైభవ్ ఇన్! న్యూజిలాండ్‌తో రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
న్యూజిలాండ్ పర్యటనను ఘనంగా ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగే రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇదే వేదికగా గురువారం ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇదే జోరులో రెండో టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌లో పైచేయి సాధించాలనే పట్టుదలతో భారత్ ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గజ్జలో గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ గాయం కారణంగానే ఇషాన్ కిషన్ తొలి టీ20లో మూడో స్థానం కాకుండా తర్వాత బ్యాటింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ గైర్హాజరీ కారణంగా టీమిండియా కాంబినేషన్‌లో మార్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వైభవ్ సూర్యవంశీకి అవకాశం..
ఇషాన్ కిషన్ వైదొలగడంతో వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కనుంది. అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఓపెనింగ్ చేయనుండగా.. సంజూ శాంసన్ ఫస్ట్ డౌన్‌లో ఆడే అవకాశం ఉంది. సంజూ, అభిషేక్ శర్మ తరహాలోనే వైభవ్ దూకుడుగా ఆడగలడు. కానీ ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్‌ను డిస్టర్బ్ చేయవద్దనుకుంటే మాత్రం వైభవ్‌కు నిరాశే మిగులుతుంది. అప్పుడు శివమ్ దూబే తుది జట్టులోకి వస్తాడు. తద్వారా టీమిండియాకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్ కూడా లభించనుంది. కానీ ఈ సాహసం మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు.
నితీష్ రెడ్డిపై వేటు..
మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.కానీ ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. తొలి టీ20లో న్యూజిలాండ్ స్పిన్నర్లు సాంట్నర్, బ్రేస్‌వెల్ సత్తా చాటారు. కానీ భారత్ ఏకైక స్పిన్నర్‌తోనే ఆడింది. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే నితీష్ రెడ్డి బెంచ్‌కే పరిమితమవుతాడు.
పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ లీడ్ చేయనున్నాడు. ప్రిన్స్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే మయాంక్ యాదవ్ బెంచ్‌కే పరిమితమవుతాడు. అర్ష్‌దీప్ సింగ్ రెండో పేసర్‌గా ఆడనున్నాడు.
న్యూజిలాండ్‌తో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి/కుల్దీప్ యాదవ్, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ యాదవ్/ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
భారత టీ20 టీమ్
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


