Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్!

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20‌ల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో మూడేళ్ల కిందటి తమ రికార్డ్‌ను అధిగమించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

226 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక ఛేజింగ్ రికార్డ్. 2023లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటి వరకు ఇదే టీమిండియాకు రికార్డ్ ఛేజ్‌గా ఉండగా.. తాజా మ్యాచ్‌తో మెరుగుపర్చుకుంది.

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్

IND vs NZ: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: మిచెల్ సాంట్నర్
India Script History at Hagley Oval with Highest Successful T20I Chase Against New Zealand

టీ20ల్లో టీమిండియా రికార్డ్ ఛేజింగ్స్

226 vs న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్ (2026)

209 vs ఆస్ట్రేలియా, విశాఖపట్నం (2023)

209 vs న్యూజిలాండ్, రాయ్‌పూర్ (2026)

208 vs వెస్టిండీస్, హైదరాబాద్ (2019)

207 vs శ్రీలంక, మొహాలీ (2009)

204 vs న్యూజిలాండ్, ఆక్లాండ్ (2020)

అంతర్జాతీయ టీ20ల్లో టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో ఇది 9వ అత్యధిక రికార్డ్ ఛేజ్. న్యూజిలాండ్‌పై సెకండ్ హయ్యెస్ట్ ఛేజ్. 2018లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 245 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

IND vs NZ: నమన్ ధీర్, శ్రేయస్ అయ్యర్ పోరాటం .. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!</a><a class=" width="200" height="113">

Also Read

IND vs NZ: నమన్ ధీర్, శ్రేయస్ అయ్యర్ పోరాటం .. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్!

సంజూ శాంసన్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. ఫిన్ అలెన్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకోబ్స్(16 బంతుల్లో 3 ఫోర్లతో 31) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్(33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 42), నమన్ ధీర్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42 నాటౌట్) అద్భుతంగా పోరాడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైఖేల్ బ్రేస్ వెల్, మిచెల్ సాంట్నర్ రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే చెరో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, October 22, 2026, 19:16 [IST]
Other articles published on Oct 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+