Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CV Anand: తెలంగాణ డీజీపీ సెంచరీ!

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీతో చెలరేగారు. ప్రోఫెషనల్ క్రికెటర్ అయిన సీవీ ఆనంద్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న సీ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో శతకంతో సత్తా చాటారు. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున సీవీ ఆనంద్ ఈ ఫీట్ సాధించారు.

సికింద్రాబాద్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య టీమ్ 39 ఓవర్లలో 7 వికెట్లకు 328 పరుగులు చేసింది. సీవీ ఆనంద్(82 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్లతో 126 నాటౌట్) అజేయ శతకంతో రాణించారు. జంషీద్‌ (77), సంజీవ్‌ రెడ్డి (40) విలువైన పరుగులు చేశారు.

Vaibhav Sooryavanshi: కెప్టెన్సీ మ్యాజిక్.. అంపైర్‌కే షాకిచ్చిన బేబీ బాస్! (వీడియో)

Vaibhav Sooryavanshi: కెప్టెన్సీ మ్యాజిక్.. అంపైర్‌కే షాకిచ్చిన బేబీ బాస్! (వీడియో)

అనంతరం హైదరాబాద్‌ 21.1 ఓవర్లలో 72/3 పరుగుల వద్ద వర్షం అంతరాయం కలిగించడంతో వీజేడీ పద్ధతిలో సికింద్రాబాద్‌ క్లబ్‌ను విజేతగా ప్రకటించారు. బౌలింగ్‌లోనూ సీవీ ఆనంద్ మెరుగైన ప్రదర్శన చేశారు. ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేసి 8 పరుగులు మాత్రమే ఇచ్చారు.

Telangana DGP CV Anand Smashes Unbeaten Century in HCA C-Division ODI League

ప్రోఫెషనల్ క్రికెటర్

ఐపీఎస్ కాకముందు క్రికెటర్ అయిన డీజీపీ సీవీ ఆనంద్..చదువకునే రోజుల్లోనే అండర్ -22కు ఎంపికయ్యారు. సికింద్రాబాద్ తరఫున ఆడుతూ ఐదు సెంచరీలు సాధించారు. ఐపీఎస్ అయిన తర్వాత కూడా క్రికెట్ ఆడటాన్ని కొనసాగించారు.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా బ్యాట్‌తో మైదానంలోకి అడుగుపెట్టేవారు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ డీజీపీకి మంచి ప్రావిణ్యం ఉంది. 2019లో ఆలిండియా భారత టెన్నిస్ టోర్నీలోనూ అగ్రస్థానం సాధించారు. పలు గోల్ఫ్ టోర్నీల్లోనూ పాల్గొన్నారు.

IND vs SL: ముఖం చాటేసిన గౌతమ్ గంభీర్?

Also Read

IND vs SL: ముఖం చాటేసిన గౌతమ్ గంభీర్?

ఏప్రిల్‌లో డీజీపీగా..

ఈ ఏడాది ఏప్రిల్‌లో సీవీ ఆనంద్ తెలంగాణ డీజీపీగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. శివధర్ రెడ్డి నుంచి సీవీ ఆనంద్ ఈ బాధ్యతలను స్వీకరించారు. తెలంగాణ డీజీపీ అయిన తర్వాత ఈ సీజన్‌లో సీవీ ఆనంద్‌ ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. తొలి మ్యాచ్‌లోనే శతకంతో ఆకట్టుకున్నారు.

సీవీ ఆనంద్ కుమారుడు చామ మిలింద్ కూడా ప్రొఫెషనల్ క్రికెటరే. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు చామ మిలింద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. లెఫ్టార్మ్ పేసర్ అయిన చామ మిలింద్.. హైదరాబాద్ తరఫున మూడు ఫార్మాట్లలో 195 మ్యాచ్‌లు ఆడి 361 వికెట్లు పడగొట్టారు.

Story first published: Monday, August 31, 2026, 10:42 [IST]
Other articles published on Aug 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+