Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: ముఖం చాటేసిన గౌతమ్ గంభీర్?

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ ఓపెనర్ స‌ద‌గోప‌న్ ర‌మేశ్ విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో రెండో టెస్ట్ డ్రా కావడంతో గౌతమ్ గంభీర్ ముఖం చాటేసాడని మండిపడ్డాడు. భారత్‌కు ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పుడల్లా గౌతమ్ గంభీర్‌ మీడియాకు దూరంగా ఉంటాడని, యువ ఆటగాళ్లకు ఆ బాధ్యతలు అప్పగిస్తాడని ఆరోపించాడు.

భారత్ విజయం సాధించినప్పుడే మీడియా సమావేశంలో పాల్గొని ప్రగల్భాలు పలుకుతాడని విమర్శించాడు. శ్రీలంకతో తొలి టెస్ట్ విజయానంతరం మీడియాతో మాట్లాడుతూ.. గంభీర్ చేసిన వ్యాఖ్యలను కూడా రమేశ్ తప్పుబట్టాడు.

Sadagoppan Ramesh Questions Gautam Gambhir for Sending Others to Press Conferences After India s Losses

ర్యాంకింగ్స్ ముఖ్యం కాదు..

తొలి టెస్ట్ విజయానంతరం గంభీర్ మాట్లాడుతూ.. ప్రస్తుత భారత జట్టు సంధి దశలో ఉందని చెప్పాడు. 'ర్యాంకింగ్స్ ముఖ్యం కాదు. టెస్ట్‌ల్లో టీమిండియా ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. ఇంగ్లండ్ పర్యటన నుంచి మేం మెరుగైన ప్రదర్శనే చేశాం.

హెడ్ కోచ్‌గా నా దృష్టిలో జట్టు పురోగతికి అంతిమ కొలమానం.. ర్యాంకింగ్స్, వ్యక్తిగత ప్రదర్శనల చుట్టూ ఉండే హడావిడి కాదు. జట్టు ట్రోఫీలు గెలవగలదా లేదా అన్నదే ముఖ్యం. ట్రోఫీలు గెలవడమే కోచ్‌గా నా పని. నేను పట్టించుకునేది, నమ్మేది కూడా అదొక్కటే. ఇతరుల అభిప్రాయాలు, ఇష్టాలతో నాకు పనిలేదు.' అని గంభీర్ స్పష్టం చేశాడు.

పిచ్చోడా.. ర్యాకింగ్స్ లేకుంటే టైటిల్ ఎలా వస్తుంది?

ఈ వ్యాఖ్యలను గుర్తు చేసిన రమేశ్.. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించకుండా డబ్ల్యూటీసీ టైటిల్ ఎలా గెలుస్తారని ప్రశ్నించాడు. 'తొలి టెస్ట్ విజయం తర్వాత గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. భారత్ విజయం సాధిస్తేనే అతను మీడియాతో మాట్లాడుతాడనే విషయం అందరికి తెలుసు. ఓడితే ఇతరులను పంపిస్తాడు. ర్యాంకింగ్స్ ముఖ్యం కాదని, టెస్ట్‌లో భారత్ ఇబ్బంది పడటం లేదని అంటాడు. ఇలా ఎలా చెబుతాడు.

ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉంటేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించగలం. అలాగే రెడ్ బాల్ క్రికెట్‌లో భారత్ తడబడుతోందని యావత్ ప్రపంచానికి తెలుసు. నిద్రపోతున్న వారిని లేపవచ్చు. కానీ నిద్ర నటిస్తున్నవారిని ఎప్పటికీ లేపలేం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుస్తుందని నేను అనుకోవడం లేదు. అసలు ఫైనల్ చేరుతుందనే గ్యారెంటీ కూడా నాకు లేదు.'అని సదగోపన్ రమేశ్ విమర్శించాడు.

డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో భారత్ ఇంకా 7 టెస్ట్‌లు ఆడాలి. ఇందులో భారత్ కనీసం 7 లేదా 6 మ్యాచ్‌లు గెలవాలి. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోవద్దు. అప్పుడే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరగలదు. భారత్ తమ తదుపరి టెస్ట్‌ సిరీస్‌లను న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్ట్‌లు, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు ఆడాల్సి ఉంది.

Story first published: Friday, August 28, 2026, 18:38 [IST]
Other articles published on Aug 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+