Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: కెప్టెన్సీ మ్యాజిక్.. అంపైర్‌కే షాకిచ్చిన బేబీ బాస్! (వీడియో)

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఆటతీరుతో వార్తల్లో నిలుస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన క్రికెట్ పరిజ్ఞానంతో, చాకచక్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం వైభవ్ సూర్యవంశీకి లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ) గ్రౌండ్ 1లో సెంట్రల్ జోన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక నిర్ణయాలతో క్రికెట్ దిగ్గజాలను కూడా ఆకట్టుకున్నాడు.

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!

Vaibhav Sooryavanshi: కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ!

బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో జరిగిన మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో వైభవ్ సూర్యవంశీ జట్టు బాధ్యతలు స్వీకరించాడు. ఈ తాత్కాలిక కెప్టెన్సీలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఘట్టం 40వ ఓవర్‌లో చోటుచేసుకుంది. తన కెప్టెన్సీలో మొదటి రివ్యూను తీసుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా సరైనదని రుజువైంది. ఈస్ట్ జోన్ బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన బంతిని సెంట్రల్ జోన్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ ఆడేందుకు ప్రయత్నించగా.. క్యాచ్ ఔట్ కోసం ముఖేష్ కుమార్ అప్పీల్ చేశాడు. అయితే ఆన్-ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. బంతి బ్యాట్ ను తాకినట్లు స్పష్టంగా గమనించి, పూర్తి విశ్వాసంతో వెంటనే డీఆర్ఎస్ రివ్యూ కోరాడు. అల్ట్రా ఎడ్జ్ రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు కదలికలు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తిరగరాసి ఆర్యన్ జుయల్‌ను ఔట్‌గా ప్రకటించాడు. వైభవ్ సూర్యవంశీ తీసుకున్న ఈ తొలి రివ్యూ నిర్ణయం సెంట్రల్ జోన్‌ను 99/4 వికెట్ల వద్ద దెబ్బతీసింది. ఆర్యన్ జుయల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ కు తిరిగి వచ్చాడు.

Vaibhav Sooryavanshi Simplicity 15-Year-Old Captain Shines with Masterclass DRS in Duleep Trophy

స్లిప్స్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ, బంతి బ్యాట్‌ను తాకడాన్ని ప్రత్యక్షంగా చూసి, తన నిర్ణయం పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. స్టంప్ మైక్రోఫోన్ శబ్దంపై ఆధారపడకుండా పరిస్థితిని అంచనా వేయగల అతని సామర్థ్యానికి కామెంటరీలో ప్రశంసలు కూడా లభించాయి. స్టాండింగ్ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర కూడా రివ్యూ తీసుకోవడంలో వైభవ్‌కు పూర్తి విశ్వాసాన్ని ఇచ్చాడు.

మ్యాచ్ ప్రారంభంలో ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే 19వ ఓవర్‌లో అతని వేలికి గాయం కావడంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది. ఇషాన్ నిష్క్రమణ తర్వాత వైస్ కెప్టెన్ వైభవ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా.. వైభవ్ ఫీల్డింగ్ సర్దుబాటు, బౌలర్లతో వ్యూహరచన బాధ్యతలను తీసుకున్నాడు. ఇషాన్ తర్వాత చేతికి టేప్ చుట్టుకుని తిరిగి వచ్చాడు, కానీ వికెట్ కీపింగ్ బాధ్యతలను తిరిగి చేపట్టలేదు.

గౌతమ్ గంభీర్ కూతురికి అరుదైన గౌరవం!

Also Read

గౌతమ్ గంభీర్ కూతురికి అరుదైన గౌరవం!

ఈ టోర్నమెంట్‌కు వైభవ్ సూర్యవంశీ తూర్పు జోన్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు . అతనికి ఫస్ట్-క్లాస్ అనుభవం తక్కువగా ఉండటంతో, అప్పట్లోనే ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఇప్పుడు ఇషాన్ గాయం అతనికి కెప్టెన్సీ చేసే అవకాశాన్ని కల్పించింది. సీనియర్ స్థాయిలో ఇది అతనికి మొదటి అనుభవం. కేవలం తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వైభవ్‌కు ఈ బాధ్యత లభించింది. అందువల్ల ఇంతటి ప్రధాన టోర్నమెంట్‌లో మైదానంలో నిర్ణయాలు తీసుకోవడం వైభవ్ సూర్యవంశీకి ఓ ఘనతేనని చెప్పుకోవచ్చు.

Story first published: Sunday, August 30, 2026, 16:15 [IST]
Other articles published on Aug 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+