కోటి రూపాయాల కార్ కొన్న టీమిండియా యువ క్రికెటర్!
టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. సుమారు కోటి రూపాయల విలువ కలిగిన మెర్సిడెస్ బెంజ్ AMG GLC43 మోడల్ కారును కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టులో భాగంగా ఉన్న ధ్రువ్ జురెల్.. ఈ సిరీస్ విజయానంతరం ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.
తన కొత్త కారు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ధ్రువ్ జురెల్ పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో తన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ముంబైలో ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర రూ.99.85 లక్షలుగా ఉంది.
3 మ్యాచ్‌ల్లో నో ఛాన్స్..
వెస్టిండీస్‌తో సిరీస్‌లో ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కలేదు. మూడు మ్యాచ్‌ల్లోనూ అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆగస్టులో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ధ్రువ్ జురెల్ ఆడాడు. ఆ సిరీస్ రెండో టెస్ట్‌లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కలేదు.

అండర్ 19 ప్రపంచకప్ 2020తో భారత జట్టులోకి దూసుకొచ్చిన ధ్రువ్ జురెల్.. ఇటీవల ఆకాష్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన తొలి క్రికెట్ సాలరీని సోదరి వివాహానికి ఖర్చు చేసినట్లు చెప్పాడు. అందులోని కొంత డబ్బుతో హ్యూండయ్ వెర్నా కార్ కొన్నానని, డౌన్ పేమెంట్ మాత్రమే కట్టానని చెప్పాడు.
తొలి జీతంతో కారు..
'నా తొలి జీతంతో కారు కొన్నాను. అండర్ 19 ప్రపంచకప్ ఆడి వచ్చిన వెంటనే హ్యుండయ్ వెర్నా కారు కొనుగోలు చేశాను. అయితే అందులోని మెజార్టీ డబ్బును మా సొదరి వివాహానికి ఖర్చు చేశాం. కొంత డబ్బును డౌన్ పేమెంట్‌గా కట్టి కారును కొన్నాం.'అని తెలిపాడు. 2020 అండర్ 19 ప్రపంచకప్‌లో ధ్రువ్ జురెల్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఆ ఎడిషన్ ఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


