గంగూలీ, గ్రేట్ కాళీ బయోపిక్ తీయాలనుకున్న సుశాంత్.. కానీ!

ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కలిచివేసింది. భారత మాజీకెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్‌తో క్రికెట్ అభిమానులకు సుపరిచుతడైన ఈ యంగ్ హీరో అకాల మరణాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. తీవ్ర చర్చనీయాంశమైన సుశాంత్ ఆత్మహత్య అతని గురించి ఆలోచించడాన్ని ఆపలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే అతనికి సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
ఇక ధోనీ బయోపిక్ సూపర్ హిట్ కావడంతో ఈ యంగ్ హీరో సౌరవ్ గంగూలీ బయోపిక్ తీయాలనుకున్నాడని, కానీ.. అప్పట్లో సౌరవ్ గంగూలీ ఒప్పుకోలేదని,ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ పేర్కొంది. సుశాంత్ సన్నిహితులే ఈ విషయాన్ని చెప్పారని రాసుకొచ్చింది.

దాదా బయోపిక్‌కు నో..
‘ధోనీ బయోపిక్ హిట్ కావడంతో సుశాంత్ మరికొన్ని బయోపిక్‌లు చేయాలని ఆశించాడు. రెజ్లర్ గ్రేట్ కాళీ, ఫుట్‌బాలర్ భైచుంగ్ భూటియా, క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌ల గురించి ప్రణాళికలు రచించాడు. అయితే.. గ్రేట్ కాళీ బయోపిక్ చర్చల వద్దే ఆగిపోగా.. సౌరవ్ గంగూలీ తన బయోపిక్‌కు అనుమతి ఇవ్వలేదు. గంగూలీతో మీటింగ్ తర్వాత అతనిపై బయోపిక్ చేసేందుకు సుశాంత్ చాలా ఆసక్తి ప్రదర్శించాడు. దాదాతో చర్చలు జరిపి హక్కులు కొనుగోలు చేయాలని తన టీమ్‌ను కూడా సుశాంత్ పంపాడు. కానీ గంగూలీ మాత్రం బయోపిక్‌కు ఒప్పుకోలేదు. దీంతో సుశాంత్ అప్పట్లో చాలా అప్‌సెట్ అయ్యాడు'అని అతని సన్నిహితులు వెల్లడించారు.
టీ20 ప్రపంచకప్‌పై చేతులెత్తేసిన ఆస్ట్రేలియా.. ఐపీఎల్ 2020కి రోడ్ క్లియర్!

బతికుంటే భైచుంగ్ భూటియాగా..
ఇక సుశాంత్ కథానాయకుడిగా ఫుట్‌బాలర్ భైచుంగ్ భూటియా బయోపిక్ దాదాపు ఫైనలైజ్ అయిందని డైరెక్టర్ ఆనంద్ కుమార్ వెల్లడించాడు. జిలా ఘజియాబాద్ ఫేమ్ అయిన ఆనంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. ‘సుశాంత్ చూడటానికి దాదాపు భూటియాలనే ఉంటాడు. అతని కళ్లు, అథ్లెటిక్ బాడీ అలానే ఉంటాయి. అయితే ఈ విషయంపై సుశాంత్‌తో మేం మాట్లాడలేదు. త్వరలోనే అతన్ని కలిసి చెప్పాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని అకాల మరణంతో ఏం చేయాలో అర్థం కావడంలేదు'అని ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ధోనీ బయోపిక్ సూపర్ హిట్..
ఇక ధోనీ బయోపిక్ ‘ఎంఎస్ ధోనీ ది అన్ టోల్ట్ స్టోరీ'బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అచ్చం ధోనీలానే నటించిన సుశాంత్‌కు దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. క్రికెట్ రాకున్నా సుశాంత్.. సినిమా కోసం 9 నెలలు కష్టపడి నేర్చుకున్నాడు. హెలికాప్టర్ షాట్ కొట్టే సీన్ పర్ఫెక్ట్‌గా రావడం కోసం దాదాపు 200 రోజులు సాధన చేశాడు. అతని మరణంపై ఆ మూవీ నిర్మాత, ధోనీ బిజినెస్ మేనేజర్ అరుణ్ పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఏ హీరోతో ధోనీ సీక్వెల్ తీయాలి సుశాంత్.. అని ఆవేదన వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడిన సచిన్!