For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్‌పై చేతులెత్తేసిన ఆస్ట్రేలియా.. ఐపీఎల్ 2020కి మార్గం సుగుమం!

Road all-clear for IPL 2020 as Cricket Australia chairman calls hosting T20 World Cup this year unrealistic
IPL 2020 Line Clear : No T20 World Cup Plans, Cricket Australia Confirms

సిడ్నీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు మార్గం సుగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో టోర్నీ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) పలుమార్లు ఈ మెగాటోర్నీ నిర్వహణపై చర్చించింది.

ఐపీఎల్‌కు రోడ్ క్లియర్..

ఐపీఎల్‌కు రోడ్ క్లియర్..

ఓ దశలో వాయిదా వేయాలని కూడా భావించింది. కానీ ఆస్ట్రేలియాలో కరోనా అదుపులోకి రావడం.. ఆ దేశ ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఐసీసీ.. ఈ ప్రపంచకప్ టోర్నీ వాయిదా నిర్ణయాన్ని పక్కనపెట్టింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 వరల్డ్‌కప్‌కు తాము ఆతిథ్యమివ్వలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఛైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ పరోక్షంగా వెల్లడించాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మెగాటోర్నీ జరిగే అక్టోబరు - నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ నిర్వహించడానికి రోడ్ క్లియర్ అయినట్టే.

 ఆఖర్లో మెలికపెట్టడంతో..

ఆఖర్లో మెలికపెట్టడంతో..

వాస్తవానికి మే నెలలోనే టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై ఐసీసీ నిర్ణయం ప్రకటించాల్సింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాలపై నిషేధం విధించగా.. ఆ దేశంలోకి 16 దేశాల క్రికెట్ జట్లని అనుమతించడం.. ఆ తర్వాత 14 రోజులు క్వారంటైన్ అసాధ్యమని క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు తేల్చి చెప్పేశారు. దీంతో ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని 2022కి వాయిదా వేయాలని ఐసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ.. తమకి 2021లో భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఆఖర్లో మెలిక పెట్టింది.

టోర్నీ నిర్వహించడం కష్టమే..

టోర్నీ నిర్వహించడం కష్టమే..

ఇక టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్యంపై క్రికెట్ ఆస్ట్రేలియా ఛైర్మన్ కార్ల్ ఎడ్డింగ్స్ తాజాగా మాట్లాడుతూ ‘టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది అధికారికంగా రద్దు లేదా వాయిదా పడలేదు. అయితే.. టోర్నీలో పోటీపడే 16 దేశాల క్రికెట్ జట్లు ఇక్కడికి రావడంపై ఉన్న అవకాశాల్ని మేం పరిశీలిస్తున్నాం. కానీ వాటిలో కొన్ని దేశాల్లో కరోనా వైరస్ పతాక స్థాయిలో ఉంది. కాబట్టి ఆ దేశాల క్రికెట్ జట్లని దేశంలోకి లేదా టోర్నీలోకి అనుమతించడం రిస్క్ అవుతుంది. నా అంచనా ప్రకారం.. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగడం చాలా చాలా కష్టం' అని వెల్లడించాడు.

 శ్రీలంకలో ఐపీఎల్..

శ్రీలంకలో ఐపీఎల్..

ఇక ఐసీసీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నా.. బీసీసీఐ ఐపీఎల్ నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదే పడితే ఆ విండోలో లీగ్ నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. అయితే సెప్టెంబర్,అక్టోబర్‌లో భారత్‌లో వర్షకాలం కావడంతో లీగ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక లేదా యూఏఈ వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిర్వహించాలని భావిస్తుంది. ఇప్పటికే ఆ రెండు దేశాలు ఆతిథ్య ఇవ్వడానికి రెడీ అని తెలిపాయి.

ఏడు నిమిషాల్లోనే టీమిండియాకు కోచ్‌నయ్యా: గ్యారీ క్రిస్టన్‌

Story first published: Tuesday, June 16, 2020, 13:19 [IST]
Other articles published on Jun 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+