Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నన్ను కోసినా ముంబై ఇండియన్స్ రక్తమే ఉంటుంది: సూర్యకుమార్ యాదవ్

ఐపీఎల్ 2027 సీజన్ నేపథ్యంలో తాను ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సూర్యకుమార్ యాదవ్ ఖండించాడు. ముంబై ఇండియన్స్ తరఫున 10వ సీజన్ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. తనను కోసినా ముంబై ఇండియన్స్ రక్తమే ఉంటుందని స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టును వీడేందుకు సూర్యకుమార్ యాదవ్ సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. కెప్టెన్సీ ఆఫర్ కోసం అతను జట్టును వీడుతున్నట్లు ప్రచారం జరిగింది. గతేడాదిన్నరగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ కూడా సిద్దమైనట్లు పుకార్లు వెలువడ్డాయి.

IND vs WI: హెట్‌మైర్ రీఎంట్రీ.. భారత్‌తో తలపడే వెస్టిండీస్ టీ20, వన్డే జట్లు ఇవే!

IND vs WI: హెట్‌మైర్ రీఎంట్రీ.. భారత్‌తో తలపడే వెస్టిండీస్ టీ20, వన్డే జట్లు ఇవే!

నేను ఎందుకు తప్పుకుంటా..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్యకుమార్ యాదవ్ ఈ వార్తలకు తెరదించాడు. ఐపీఎల్‌ అంటేనే ఓ పండుగలా ఉంటుందని, ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో చేరి ఆటగాళ్లను కలవడం తనకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందని స్పష్టం చేశాడు. 'ముంబై ఇండియన్స్‌ క్యాంప్‌లో చేరి ఆటగాళ్లను కలవడం నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ముంబై ఇండియన్స్‌తో నా ప్రయాణం 10 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. మీరు నా బ్లడ్ చెక్ చేసినా బ్లూ కలర్‌లోనే ఉంటుంది.'అని సరదాగా వ్యాఖ్యానించాడు.

Suryakumar Yadav Dismisses Mumbai Indians Exit Reports If You Check My Blood It ll Be Blue

ముంబై ఇండియన్స్ ఒక విద్యాసంస్థలాంటిది. అక్కడ ఉంటే క్రమ శిక్షణ అలవాటవుతుంది. మన అభివృద్ది కోసం ఏడాదంతా వాళ్లు కష్టపడుతారు. ముంబైలో క్రికెటర్ల కోసం ఏడాదంతా అందుబాటులో ఉండే మంచి సౌకర్యాలు వాళ్ల దగ్గర ఉన్నాయి.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

బుడ్డోడి నైపుణ్యం కావాలి..

ఇతర క్రికెటర్ల నుంచి ఒక్క నైపుణ్యం కావాలనుకుంటే ఎవర్ని ఎంచుకుంటారని ఈ ఇంటర్వ్యూలో అడగ్గా.. సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, ఎంఎస్‌ ధోనీ, ఏబీ డివిలియర్స్‌ వంటి క్రికెట్ దిగ్గజాలు కాకుండా.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ‌లోని సిక్సర్ల కొట్టే నేపుణ్యం తనకు కావాలని చెప్పాడు. 'వైభవ్‌ సూర్యవంశీ అనే ఓ కుర్రాడి గురించి మీరు వినే ఉంటారు. అతడి సిక్సర్లు కొట్టే నైపుణ్యాన్ని కచ్చితంగా తీసుకుంటా' అని తెలిపాడు.

నిరాశపర్చిన సూర్యకుమార్ యాదవ్..

ఐపీఎల్‌ 2026లో వైభవ్ సూర్యవంశీ‌ సంచలన ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. 16 మ్యాచ్‌ల్లో 237.31 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేసిన వైభవ్.. టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఈ టోర్నీలో ఏకంగా 72 సిక్స్‌లు బాదిన వైభవ్.. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డ్‌తో పాటు అత్యధిక సిక్స్‌లు, స్ట్రైక్‌రేట్‌ అవార్డులను అందుకున్నాడు.

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

Also Read

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

మరోవైపు సూర్యకుమార్‌ యాదవ్‌కు ఐపీఎల్‌ 2026 సీజన్ కలిసిరాలేదు. 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు చేశాడు. దాంతో ముంబై ఇండియన్ పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. ఈ పేలవ ప్రదర్శన తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ కెప్టెన్సీతో పాటు భారత టీ20 జట్టులోనూ చోటు కోల్పోయాడు.

Story first published: Monday, September 21, 2026, 13:09 [IST]
Other articles published on Sep 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+