Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. వన్డే సారథ్య బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉంది.
ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్‌ల కోసం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ చివరి వారంలో ఈ పర్యటన మొదలవ్వనుంది. అయితే ఈ సిరీస్‌లోని చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించే అవకాశం ఉంది.

IND vs WI: హెట్‌మైర్ రీఎంట్రీ.. భారత్‌తో తలపడే వెస్టిండీస్ టీ20, వన్డే జట్లు ఇవే!

IND vs WI: హెట్‌మైర్ రీఎంట్రీ.. భారత్‌తో తలపడే వెస్టిండీస్ టీ20, వన్డే జట్లు ఇవే!

వన్డే సిరీస్‌కు టెస్ట్ సిరీస్‌ ప్రారంభానికి మధ్య నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. శుభ్‌మన్ గిల్‌తో సహా టెస్ట్ ప్లేయర్లంతా చివరి రెండు వన్డేలకు దూరంగా ఉంచాలని టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా న్యూజిలాండ్‌లోనే ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహించే అవకాశం ఉంది.

Shreyas Iyer Likely to Captain India in Final Two ODIs Against New Zealand Reports

కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఇతర టెస్ట్ ప్లేయర్లు చివరి వన్డేలకు దూరంగా ఉంచి టెస్ట్ సిరీస్‌కు సన్నదం చేయనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ బెర్త్‌ను భారత్ దక్కించుకోవాలంటే ఈ రెండు టెస్ట్‌ల సిరీస్ గెలవడం టీమిండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో భారత్ ఇంకా 7 టెస్ట్ ఆడాల్సింది. ఈ 7 మ్యాచ్‌లకు 7 గెలిస్తేనే భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కుతుంది. న్యూజిలాండ్ పర్యటనలో ఒక్క మ్యాచ్ ఓడినా భారత్ ఆశలు అడియాశలవుతాయి.

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

Also Read

యువరాజ్ సింగ్ సలహాతోనే ఈ విధ్వంసకర శతకం: అభిషేక్ శర్మ

ఈ క్రమంలోనే ఈ సిరీస్ గెలవడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ అనంతరం వచ్చే ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడనుంది. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది.

అక్టోబర్ 24 నుంచి నవంబర్ 1 వరకు ఐదు టీ20ల సిరీస్ జరగనుండగా.. నవంబర్ 4 నుంచి 15 వరకు ఐదు వన్డేల సిరీస్ జరగనుంది. నవంబర్ 19 నుంచి 27 వరకు రెండు టెస్ట్‌ల సిరీస్ నిర్వహించనున్నారు.

Story first published: Sunday, September 20, 2026, 16:57 [IST]
Other articles published on Sep 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+