Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ సౌత్ జోన్ వ్యక్తికే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌ పదవి!!

Sunil Joshi to replace MSK Prasad as Chairman of BCCIs senior men’s selection committee

ముంబై: ఊహాగానాలకు తెరదించుతూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ స్పిన్నర్ సునీల్ జోషీ ఎంపికయ్యాడు. మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) బుధవారం భారత చీఫ్ సెలెక్టర్ ఛైర్మన్‌గా సునీల్ జోషీ పేరును ప్రకటించింది. దీంతో మరోసారి సౌత్ జోన్‌కు చెందినే వ్యక్తికే ఛైర్మన్‌గా అవకాశం దక్కింది.

హర్విందర్ సింగ్ కూడా..

హర్విందర్ సింగ్ కూడా..

ఐదుగురు సభ్యులతో కూడిన సెలెక్షన్ ప్యానె‌ల్‌లో మాజీ క్రికెటర్ హర్విందర్ సింగ్ సైతం చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగిన ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో జోషీ బాధ్యతలు చేపట్టనున్నాడు. పదవీ కాలం ముగిసిన సెలెక్టర్లలో గగన్‌ ఖోడా స్థానంలో హర్విందర్ సింగ్ ప్యానెల్‌లో చొటు దక్కించుకున్నాడు. ఇక దెవాంగ్ గాంధీ, సరన్‌దీప్ సింగ్, జతిన్ పరంజపే‌లు మరో ఏడాది పాటు కమిటీలో కొనసాగనున్న విషయం తెలిసిందే.

దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేసి తప్పు చేశా : స్టార్ హీరోయిన్

ఐదుగురితో షార్ట్ లిస్ట్..

ఐదుగురితో షార్ట్ లిస్ట్..

మంగళవారం సమావేశమైన సీఏసీ... మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్‌ దరఖాస్తును తిరస్కరించింది. రెండు ఖాళీల కోసం 44 మంది దరఖాస్తు చేసుకోగా... అందులో నుంచి వెంకటేశ్‌ ప్రసాద్, సునీల్‌ జోషి, లక్ష్మణ్‌ శివరామకృష్ణన్, హర్విందర్‌ సింగ్, రాజేశ్‌ చౌహాన్‌లను షార్ట్ లిస్ట్ చేసి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించింది. చివరకు సునీల్ జోషి, హర్విందర్ సింగ్‌లను ప్యానెల్‌‌కు ఎంపిక చేసింది.

భారత్‌కు వచ్చినప్పుడు.. తానేంటో చూపిస్తానన్న కోహ్లీని చూస్తే నవ్వొస్తుంది : ఆసీస్ పేసర్

తొలి సవాల్..

తొలి సవాల్..

భారత్ తరఫున 15 టెస్ట్‌లు ఆడిన సునీల్ జోషీ 41 వికెట్లు తీశాడు. 69 వన్డేల్లో 69 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాతో మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు సునీల్ జోషీ నేతృత్వంలోని సెలెక్షన్ కమీటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడం ఈ నూతన కమిటీకి సవాల్‌తో కూడుకున్నదే.

Story first published: Wednesday, March 4, 2020, 19:17 [IST]
Other articles published on Mar 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+