దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేసి తప్పు చేశా : స్టార్ హీరోయిన్

హైదరాబాద్: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేసి పెద్ద తప్పుచేశానని బాలీవుడ్ నటి నీనా గుప్తా ఆవేదన వ్యక్తం చేసింది.టెలివిజన్‌తో పాటు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ తారా.. రిచర్డ్స్ క్రికెట్ ఆడుతున్న సమయంలో అతనితో ప్రేమలో పడింది. వారిద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా మసాబా గుప్తా అనే ఓ కూతురు కూడా ఉంది. అనంతరం రిచర్డ్స్‌తో విడిపోయిన ఆమె ప్రస్తుతం వివేక్ మెహ్రా అనే చార్టెడ్ అకౌంట్(సీఏ)ను వివాహం చేసుకుంది.

నాలా మోసపోకండి..
తాజాగా పెళ్లైన వ్యక్తితో బంధాలు పెట్టుకోవద్దని హెచ్చరిస్తూ నీనా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియో తెగ వైరల్ అయింది. ఈ వీడియోలో ‘దయచేసి పెళ్లైన వ్యక్తితో సంబంధాలు పెట్టుకొవద్దు. నేను అలా చేసి జీవితంలో తీరని గుణపాఠం నేర్చుకున్నా. నా లైఫ్‌లో ఎన్నో బాధలను అనుభవించా. నాలా ఇబ్బంది పడొద్దనే మీ అందరికి సలహా ఇస్తున్నా. మీరు దయ చేసి అలాంటి పనులు చేయకండి'అటూ నీనా గుప్తా ఆవేదన వ్యక్తం చేసింది.
కూతురిని కని ఇంకా పెద్ద తప్పు చేశా..
వీవీ రిచర్డ్స్‌తో సహజీవనమే తప్పంటే.. బిడ్డకు జన్మనిచ్చి ఇంకా పెద్ద తప్పుచేశానని తెలిపింది. ఆమెను పెంచే విషయంలో, పెళ్లి చేయడానికి పడిన కష్టాలు అంత ఇంత కావని పేర్కొంది. తన స్వార్ధపూరిత ఆలోచనల వల్ల తన కూతురు నానా కష్టాలు పడిందని చెప్పుకొచ్చింది. ‘రిచర్డ్స్‌తో సహజీవనం చేయడం నా స్వార్ధం. పిల్లలకు మంచి జరగదని అప్పుడు చాలా మంది స్నేహితులు సలహా ఇస్తే ఆ సమయంలో పెడచెవిన పెట్టాను. నా కూతురు ఒంటరితనంతో బాధపడింది. 'అని నీనా గుప్తా తెలిపారు.

క్రికెట్ లెజెండ్ రిచర్డ్స్..
వివ్ రిచర్డ్స్ వెస్టిండీస్ తరఫున 121 టెస్టుల్లో 50.23 సగటుతో 8540 పరుగులు చేసాడు. అందులో 24 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అత్యధిక స్కోరు 291 పరుగులు. 56 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి టెస్ట్ క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక 187 వన్డేల్లో 6721 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 45 అర్థ సెంచరీలు సాధించాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిచర్డ్స్ గుడ్‌బై చెప్పాడు.
భారత్‌కు వచ్చినప్పుడు.. తానేంటో చూపిస్తానన్న కోహ్లీని చూస్తే నవ్వొస్తుంది : ఆసీస్ పేసర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications