Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కఠిన చర్యలు కాదు.. ఆ పనిచేయాలి: బీసీసీఐకి సునీల్ గవాస్కర్ అడ్వైజ్!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు సిరీస్‌లు కోల్పోయిన టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పసికూన ఐర్లాండ్‌తో రెండు టీ20 సిరీస్‌లతో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ల్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా క్లీన్ స్వీప్ అయిన సంగతి తెలిసిందే.

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

ఈ రెండు సిరీస్‌ల పరాజయాల నేపథ్యంలో బీసీసీఐ సమీక్ష నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కాటేను తప్పించడంతో పాటు కొందరు ఆటగాళ్లపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.

Sunil Gavaskar Urges Urgent Action on Short Boundaries after India s humiliating T20I losses

అది తీవ్ర నిర్ణయమే..

తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సునీల్ గవాస్కర్.. కఠిన చర్యల కంటే బౌండరీల దూరం పెంచడంపై బీసీసీఐ దృష్టిపెట్టాలని సూచించాడు. 'వరుసగా రెండు టీ20 సిరీస్‌ల్లో ఎదురైన పరాజయాలపై బీసీసీఐ సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రివ్యూలో ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే జరిగితే మేనేజ్‌మెంట్ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లే. నాలుగు నెలల క్రితమే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్.. ఐసీసీ ర్యాకింగ్స్‌లోనూ నెంబర్ 2గా కొనసాగుతోంది. భారత బ్యాటర్లు ఎక్కువగా ఫ్లాట్ పిచ్‌లపై ఆడటం దెబ్బతీసిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కానీ, ఫ్లాట్ పిచ్‌లపై కూడా భారత బ్యాటర్లు షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఇది పూర్తిగా టెక్నికల్ లోపమనే తెలుస్తోంది.

IND vs ENG: సామ్ కరణ్ X శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ!(వీడియో)

IND vs ENG: సామ్ కరణ్ X శ్రేయస్ అయ్యర్ మధ్య గొడవ!(వీడియో)

చిన్న బౌండరీల వల్లే..

అంతేకాకుండా భారత్‌లో ఉండే చిన్న మైదానాలు కూడా భారత్ వరుస పరాజయాలకు కారణమవుతోంది. భారత్‌లో జరిగే టీ20 మ్యాచ్‌ల్లో బ్యాటర్లు కొట్టిన సిక్స్‌ల్లో చాలా వరకు బౌండరీ లైన్‌కు కొంత దూరం వెలుపలే పడ్డాయి. అవే విదేశాల్లో క్యాచ్‌లుగా మారుతున్నాయి.

టీ20 ప్రపంచకప్ 2028 సిద్దమవుతున్న వేళ.. బీసీసీఐ బౌండరీలను పెంచడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి. ప్రతీ మైదానంలో బౌండరీలను పెంచే అవకాశం ఉంది. కానీ అలా చేసేందుకు బీసీసీఐ సుముఖత చూపిస్తుందా? అన్నదే పెద్ద ప్రశ్న. అలా చేయాలని కోరుకుంటున్నా.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, July 17, 2026, 15:31 [IST]
Other articles published on Jul 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+